narasimhulu
-
పత్తికొండ హత్య కేసులో టీడీపీ నేతే హంతకుడు
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది. అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్.. హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు. ఇప్పుడేమంటావ్ లోకేశ్? హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్సీపీ, జగన్మోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!? -
కైఫియత్తులే ఇంటిపేరుగా...
బలమైన చారిత్రక ఆధారాలైన కైఫియత్తులను ఇంటి పేరుగా మార్చు కొన్న గొప్ప భాషావేత్త, పరిశోధకులు... విద్వాన్ కట్టా నరసింహులు. వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట సమీపంలోని కొత్తపల్లి వాసి. తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించారు. బ్రౌన్ గ్రంథాలయ ఆవిర్భావం తర్వాత దాని వ్యవస్థాపక సెక్రెటరీ డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రితో పరిచయం... కట్టా పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ గ్రంథాలయానికి చేర్చింది. బ్రౌన్ గ్రంథాలయ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని పటిష్టం చేసేందుకు కట్టా పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన వ్యక్తిత్వం, శక్తియుక్తిలకు తృప్తిచెందిన జానమద్ది ఆయనకు మెకంజీ రాసిన ‘కడప కైఫియత్తు’ల పరిష్కార బాధ్యతను అప్పగించారు. ఫలితంగా 3,000 పైచిలుకు పేజీలతో, 8 సంపుటాల కడప కైఫియత్తులు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి. ఆయన కేవలం కడప కైఫియత్తుల ఆధా రంగా ఇంతవరకు వెలుగు చూడని చారిత్రకాంశాలతో ‘కైఫియత్ కతలు’ పేరిట పుస్తకం వెలువరించారు. రాయలసీమలో శ్రీకృష్ణ దేవరాయల పాలన వలె ఆయన బంధువులైన ‘మట్లి’ రాజుల పాలన సాగిందని కట్టా నిరూపించారు. తన జన్మస్థలి ఒంటిమిట్ట గురించి పూర్తి చారిత్రక ఆధారాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు వెలువరించి, అక్కడ ఉన్న రామాలయ చరిత్రను లోకానికి తెలిపారు. (చదవండి: నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి) ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి ప్రభుత్వ లాంఛనాల హోదా కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ కృషి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ‘పోతన భాగవతం’ ప్రాజెక్టులో సేవలందించే అవకాశాన్ని కల్పించింది. అక్కడ పని చేస్తూనే ఆయన 2021 మే 15న కరోనాతో కన్నుమూశారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా కడపలోని బ్రౌన్ కేంద్రంలో సదస్సు జరగనుంది. – పవన్‌కుమార్ పంతుల, జర్నలిస్ట్ (మే 15న విద్వాన్ కట్టా నరసింహులు తొలి వర్ధంతి) -
ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పారా లేక మరేదైనా..!
సాక్షి, ప్రొద్దుటూరు: ఎగువ అహోబిలంలో కనిపించకుండా పోయిన దంపతుల కోసం పోలీసులు విస్తతంగా గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని నంగనూరుపల్లెకు చెందిన పల్లెబోయిన నరసింహులు, నీలిమా అనే దంపతులు ఈ నెల 21న కర్నూలు జిల్లాలోని అహోబిలం క్షేత్రానికి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు 23న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎగువ అహోబిలం సమీపంలోని కారంజ నరసింహస్వామి ఆలయం సమీపంలో నరసింహులుకు చెందిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంపతులిద్దరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పి తప్పారా లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో దంపతుల అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వారి సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: (వదినతో వివాహేతర సంబంధం.. అన్నకు తెలిసి..) ప్రతి నెలా అహోబిలం వెళ్లేవారు.. నంగనూరుపల్లె గ్రామానికి చెందిన నరసింహులు ప్రొద్దుటూరులోని కోనేటికాల్వ వీధిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వారికి సంతానం లేదు. గతంలో చీరల దుకాణం ఉండగా కొన్ని నెలల క్రితం మరొక రెడిమేడ్ షాపును ప్రారంభించారు. రెండు షాపుల నిర్వహణ బాధ్యతలను భార్యాభర్తలే చూసుకునేవారు. గతంలో ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తుండగా ఏడేళ్ల నుంచి కోనేటికాల్వ వీధిలో ఇల్లు బాడుగకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. షాపు నిర్వహిస్తున్న ఇంటిపైనే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మాత్రం నంగనూరుపల్లెలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అహోబిలం వెళ్తుంటారు. ముందు రోజు రాత్రి వెళ్లి దర్శనం ముగించుకొని మరుసటి రోజు రాత్రికి ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో ఈ నెల 21న బైక్‌లో నరసింహులు, నీలిమా అహోబిలం వెళ్లారు. ఇప్పటివరకు ఇంటికి రాకపోవడంతో దుస్తుల కొనుగోలుకు వెళ్లారేమోనని కుటుంబ సభ్యులు భావించారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు అహోబిలం వెళ్తారని గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్లి గాలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజులైనా వారి జాడ కనిపించకపోవడంతో గ్రామంలోని బంధువులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..) ఆర్థిక సమస్యలపైన అనుమానం.. వ్యాపారం కోసం నరసింహులు అనేక మంది వద్ద అప్పు తీసుకున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. స్వగ్రామంలోనే అప్పులిచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. బాకీలు రూ. కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా రెండు బట్టల షాపులు మూసి ఉండటంతో అప్పులిచ్చిన వారు నంగనూరుపల్లెలోని నరసింహులు ఇంటి వద్దకు వెళ్తున్నారు. వారికి జవాబు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ పోలీసులకు తెలిపారు. ఈ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
గొర్రెల కాపరి ఆత్మహత్య
గాండ్లపెంట (కదిరి) : గాండ్లపెంట మండలం రెడ్డివారిపల్లిలో రాగినేని నరసింహులు(38) అనే గొర్రెల కాపరి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకోవడాన్ని బుధవారం కనుగొన్నట్లు ఎస్ఐ హరినాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. నరసింహులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారు పెళ్లీడుకువచ్చారు. పెద్ద కుమార్తె శోభనను తన చెల్లెలి కుమారుడితో నిశ్ఛితార్థం చేసుకోవాలనుకున్నాడు. అయితే తన వద్ద చిల్లిగవ్వ లేదు. గొర్రెలను అమ్మినా పెళ్లి ఖర్చులకు సరిపోదు. అన్నదమ్ములకు రెండెకరాల పొలం ఉండగా, ఇంకా పంపకాలు జరగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మనస్తాపానికి గురైన నరసింహులు రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఊరి బయట గల వంకలోని చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఉదయమే పొలాలకు నీరు వదిలేందుకు వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమార్తెలిద్దరూ తమ తండ్రి మృతదేహంపై పడి ‘ఇక మాకు దిక్కెవరంటూ’ ఏడ్వడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఎస్ఐ తమ సిబ్బందితో నేర స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కాటేసిన కరెంట్
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే బాత్రూంలోకి వెళ్లిన ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కిందపడిపోయాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వివరించారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 43-ఉడేగోళంలో మేస్త్రీ.. కణేకల్లు : మండలంలోని 43-ఉడేగోళంలో ఎర్రగుంటలోని కెనిగుంటకు చెందిన వడ్డే హనుమంతరాయుడు(26) అనే మేస్త్రీ బుధవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య రోజా, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
భూమి కోసం దళితుడి నిరసన
అమడగూరు (పుట్టపర్తి) : తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన నరసింహులు అనే దళితుడు బుధవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా 414 సర్వే నెంబరులోని నాలుగు ఎకరాల భూమి తన ఆధీనంలో ఉందన్నారు. పాస్‌పుస్తకం కూడా తన పేరుమీదే ఉందన్నారు. అయితే తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తనకు తెలియకుండా అతని పాస్‌పుస్తకంలో ఈ భూమిని ఎక్కించుకున్నారని ఆవేదన చెందారు. పై అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని విచారం వెలిబుచ్చారు. -
మగ సంతానం కోసం రెండో పెళ్లి
నిలదీసిన మొదటి భార్యపై హత్యాయత్నం మదనపల్లె క్రైం (చిత్తూరు) : మగ సంతానం కోసం రెండో పెళ్లి చేసుకుని, విషయం తెలిసి నిలదీసిన మొదటి భార్యపై హత్యాయత్నం చేసిన భర్త ఉదంతమిది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల కథనం మేరకు... చిత్తూరు జిల్లా పీటీఎం మండలం చలిమామిడికి చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె లక్ష్మీనరసమ్మను అనంతపురం జిల్లా కదిరి పట్టణం బాలప్పగారి క్వార్టర్స్‌లో ఉంటున్న సత్తెన్న, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.శ్రీనివాసులుకు ఇచ్చి 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. మగ సంతానం లేకపోవడంతో శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకోవాలని ఏడాది కాలంగా భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం శ్రీనివాసులు అదే జిల్లా గాండ్లపెంట మండలం ఎర్రచేనుకు చెందిన లక్ష్మి అనే యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. నాలుగు రోజుల క్రితం భర్తను నిలదీయడంతో అతను ఆమెపై ఇటుక రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి బాధితురాలిని పుట్టింటికి పంపించారు. తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారు పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెళ్లైన 24 గంటలు గడవకముందే...
ములకలచెరువు: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు గడవకముందే.. వరుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం గుడుపల్లెలో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మిద్ది నరసింహులు(22)కు గ్రామానికి చెందిన ప్రమీల(20)తో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం సాంప్రదాయంలో భాగంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఇంటికి వచ్చాడు. పడకగదిలో తన మొబైల్ చార్జింగ్ పెట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా అప్పటికే నరసింహులు చనిపోయాడు. శుక్రవారం ఎంతో సంతోషంగా.. అందరి ఆశ్వీరచనాలతో పెళ్లి చేసుకున్న నరసింహులు.. పెళ్లి దుస్తులు కూడా విప్పకముందే విగతజీవిగా మారడంతో స్తానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నరసింహులు మృతితో ప్రమీల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించిన బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలి
జానపద కళాకారుల సంక్షేమ సంఘం అనంతపురం కల్చరల్ : మన సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని కృష్ణదేవరాయల జానపద కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరసింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జానపద కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ వెంకటరాముడు మాట్లాడుతూ కళాకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. 2013 తర్వాత ఇప్పటి వరకు గుర్తిపు కార్డులు ఇవ్వలేదన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లనివ్వాలని, ప్రభుత్వ బంజరు భూముల్లో వ్యవసాయం చేసుకునే వీలు కల్పించాలన్నారు. సంక్రాంతి లక్ష్మి పథకం కింద పాడి ఆవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, మీనాక్షి, ప్రమీâýæమ్మ, వెంకటలక్ష్మి, గోపాల్ , సుబ్బారాయుడు, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్
అనంతపురం న్యూటౌన్ : యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చే సి రూ.1000 కోట్లు కేటాయించాలని యాదవ మహా సభ ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. ఈ మేరకు ఆ దివారం స్థానిక రామనగర్‌లోని సంఘం కా ర్యాలయంలో యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నరసింహులు అధ్యక్షతన సర్వసభ్య స మావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావుయాదవ్, ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సామాజికంగా బలంగా ఉన్న కాపు వర్గాలకు రిజర్వేషన్లను కేటాయిస్తామనడం బీసీ వ్యతిరేక చర్య గా అభివర్ణించారు. అనంతరం యాదవుల అ భివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రత్యేక తీర్మానాలను ఆమోదించారు. సోమవారం మంజునాథ కమిషన్ ఎదుట యాదవులు బీసీల వాణిని గట్టిగా వినిపించాలన్నారు. కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు నారాయణస్వామియాదవ్, రాజశేఖరయాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, చంద్రమోహన యాదవ్ పాల్గొన్నారు. -
విరేచనాలతో వ్యక్తి మృతి
ఓడీ చెరువు : ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు(55) విరేచనాలతో బాధపడుతూ మతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. వారం నుంచి విరేచనాలతో బాధపడుతూ కదిరి, బత్తలపల్లి, అనంతపురం ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. పరిస్థితి విషమంగా మారడటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వారు తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
క్రీడలతో స్నేహ సంబంధాలు
కల్లూరు: క్రీడలతో స్నేహ సంబంధాలు మెరగుపడతాయని రాయలసీమ యూనివర్సిటీ వైఎస్ ఛాన్స్లర్ వై. నరసింహులు అన్నారు. గురువారం నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల క్రీడా మైదానంలో రాయలసీమ యూనివర్సిటీ మహిళా అంతర్ కళాశాలల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఆయన.. బాల్ సర్వీసు చేసి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటమి చెందిన క్రీడాకారులు కలత చెందకుండా మరో పోటీకి సిద్ధం కావాలన్నారు. ఉత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ రాజేశ్వరి మాట్లాడుతూ బాల్‌బాడ్మింటన్ 7 జట్లు, వాలీబాల్ 7 జట్లు, ఖోఖో 10 జట్లు వచ్చాయని, షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో టోర్నమెంట్ కార్యదర్శి కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ విజయభారతి, యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కేవీ శివకిశోర్, పీఈటీలు, కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. బాల్‌బాడ్మింటన్‌లో కోడుమూరు కాలేజ్ జట్టు, ఉస్మానియా కాలేజ్ జట్టుపై 29–4 పాయింట్లతో గెలిచింది. కేవీఆర్ కాలేజ్ జట్టుపై కోడుమూరు ఎస్విడిసి జట్టు, ఎస్పివై రెడ్డి కాలేజ్ జట్టుపై సెయింట్ జోసఫ్ కాలేజ్ జట్టు విజయం సాధించింది. వాలీబాల్‌లో ఎస్పీవైరెడ్డి కాలేజ్ జట్టుపై ఉస్మానియా కాలేజ్ జట్టు (25–18, 25–12), సెయింట్ జోసఫ్ కాలేజ్ వెంకాయపల్లె జట్టుపై సెయింట్ జోసఫ్ సుంకేసుల రోడ్డు కాలేజ్ జట్టు (25–19, 25–15), కోడుమూరు కాలేజ్ జట్టుపై కేవీఆర్ కాలేజ్ జట్టు (25–13, 25–10) పాయింట్ల తేడాతో విజయం సాధించాయి. ఖోఖోలో నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జట్టుపై కేవీఆర్ కాలేజ్ జట్టు (15–0) పాయింట్లతేడాతో విజయం సాధించింది. -
హిందూపురానికి జ్వరమొచ్చింది
– విజృంభిస్తున్న డెంగీ, మలేరియా – మృత్యువాత పడుతున్న రోగులు హిందూపురం టౌన్ : పట్టణంలోని జ్వరాలతో బెంబేలెత్తిపోతున్నారు. సీజనల్ వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో పట్టణవాసులు ఆస్పత్రి పాల్పవుతున్నారు. జ్వరాల బారిన పడుతున్న వారిలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. వర్షకాలం కావడంతో పట్టణ, మండల ప్రాంతాల్లో అపరిశుభ్రత సమస్యతో ప్రజలు రోగాలకు గురవుతున్నారు. దీనికి తోడు దోమకాటుతో మలేరియా జ్వరం వేగంగా సోకుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. మలేరియాకు తోడు డెంగీ జ్వరాలు కూడా విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి హిందూపురం మండలంలోని మణేసముద్రానికి చెందిన నరసింహులు (27) డెంగీ లక్షణాలతో గత నెల 28న మృతి చెందాడు. మృతుడు కొన్ని రోజులుగా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరంలో బాధపడుతూ చికిత్స పొందుతుండేవాడు. పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే నరసింహులు మరణించాడు. ఒకే మంచంపై ఇద్దరు లేదా ముగ్గురు ఆస్పత్రికి జ్వరాలతో వచ్చే రోగుల తాకిడి పెరగడం, మంచాల సంఖ్య తక్కువ ఉండడంతో ఒకే మంచంపైనే ఇద్దరు లేదా ముగ్గురు రోగులను ఉంచాల్సి వస్తోంది. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు జ్వరాల బాధతో చేరే వారి సంఖ్య సుమారు 40 నుంచి 50 వరకు ఉంటోంది. దీంతో ఒకే మంచంపై ఇద్దరిద్దరిని ఉంచడంతో మరిన్ని జబ్బులు సోకే ప్రమాదం ఉందని రోగుల బంధువులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి జ్వరం సోకినా అందరికీ వచ్చిన ట్టే. ఫలితంగా పట్టణ ప్రజలు జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. -
డెంగీ జ్వరంతో వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : మండలంలోని మణేసముద్రం గ్రామానికి చెందిన నరసింహులు (27) డెంగీ జ్వరంతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోజువారీ కూలీ పనులు చేసే నరసింహులు కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో డెంగీ జ్వరం వచ్చిందని వెంటనే అనంతపురం తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు. ఈ మేరకు అంబులెన్స్‌లో అనంతపురం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఈతకు వెళ్లి నలుగురు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతిచెందారు. జిల్లాలోని కోస్గి ఉగేని చెరువులో సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందారు. స్థానిక కడపాలెం వీధికి చెందిన వెంకటేష్(10), బోయ నర్సింహులు(10), కురువ నర్సింహులు(10), బోయ వెంకటేష్(12) అనే నలుగురు పిల్లలు మరికొంత మంది స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో నీళ్లు లేకపోవడంతో.. పిల్లలు బురదలో చిక్కుకుని మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బోయ గోవింద్ అనే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఒకే కాలనికి చెందిన నలుగురు బాలురు మృతిచెందడంతో.. పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి
తాడ్వాయి: విందు కోసం బంధువుల ఇంటికి రాగా, సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దోమకొండ మండలం యాడారం గ్రామానికి చెందిన వడ్ల నరసింహులు (22) నందివాడలో బంధువుల ఇంటికి సోమవారం వచ్చాడు. అదే రోజు అర్ధరాత్రి సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో షాక్‌కు గురయ్యాడు. కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఏడేళ్ల జైలు
చెన్నై: భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు మహిళా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆంధ్రా, చిత్తూరుకు చెందిన పెంచిల నరసింహులు (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్. నరసింహులుకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన స్వరూపతో 2012లో వివాహం జరిగింది. పెళ్లి తరువాత దపంతులు చెన్నైలోని కేకే.నగర్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం నరసింహులు తరచూ స్వరూపను వేధించేవాడు. ఈ విషయమై దంపతులు గొడవపడేవారు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక 2013 సెప్టెంబర్ 13న స్వరూప ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై విచారణ జరిపిన అశోక్‌నగర్ పోలీసులు నరసింహులపై వరకట్న కేసు నమోదు చేశారు. ఈ కేసు మద్రాసు మహిళా న్యాయస్థానంలో న్యాయమూర్తి కలైమది సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది గౌరి అశోకన్ హాజరై కేసుపై విచారణ జరిపారు. నేరం నిర్ధారణ కావడంతో పెంచిల నరసింహులకు ఏడేళ్లు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. -
రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు
ధర్మవరం(అనంతపురం జిల్లా): ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వేగేటు వద్ద బుధవారం రైలు ఢీకొని నర్సింహులు(45) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నర్సింహులును ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి
వైఎస్సార్ జిల్లా: టేబుల్ ఫ్యాన్ పక్కకు జరుపుతూ ప్రమాదవ శాత్తూ విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్‌జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని మల్లినేనిపట్నం కాలనీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కె. నరసింహులు (50), ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పడుకునే సమయంలో టేబుల్ ఫ్యాన్‌ను పక్కకు జరుపుతుండగా.. సుబ్బలక్ష్మమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో నరసింహులుకు కూడా షాక్ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జవాబు చెప్పలేదని చితకబాదిన ఉపాధ్యాయుడు
రాయికోడ్ : ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటూ ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు చితకబాది గాయపరచిన సంఘటన మండలంలోని చిమ్నాపూర్‌లోని ప్రైవేటు పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థి మేనమామ బసప్ప కథనం మేరకు.. న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామానికి చెందిన శ్రీను కుమారుడు నరసింహులు మండలంలోని కుసునూర్ గ్రామంలోని తన మేనమామ బసప్ప వద్ద ఉంటూ, చిమ్నాపూర్ గ్రామ శివారులోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటున్నాడు. సోమవారం రోజు లాగానే పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో తరగతి గదిలో పాఠాన్ని భోధించడానికి వచ్చిన ఉపాధ్యాయుడు నాగరాజు.. నరసింహులును ఓ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడిగాడు. అయితే నరసింహులు సమాధానం చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయుడు నాగరాజు అతడిని చితకబాదాడు. వీపు భాగంలో రక్తం చిమ్మేలా వాటర్ై పెపుతో కొట్టాడని విద్యార్థి మేనమామ ఆరోపించాడు. ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించడంతో నరసింహులు వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి పట్ల పైశాచికంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు నాగరాజుపై చర్యలు తీసుకోవాలని బసప్ప అధికారులను కోరాడు. -
స్టీరింగ్ ఆటో, టిప్పర్ ఢీ
పుల్కల్ : ఎదురెదురుగా వస్తున్న స్టీరింగ్ ఆటో, టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎదుట సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన దండుగల నరసింహులు (42), అదే గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శోభ (28), కమ్మరికత్త గ్రామానికి చెందిన స్వరూప (30)లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరి కుటుంబాలు పనుల నిమిత్తం పటాన్చెరు ప్రాంతానికి వలస వచ్చారు. అయితే సోమవారం స్వ గ్రామానికి బయలుదేరారు. అందులో భాగంగానే పటాన్చెరు నుంచి జోగిపేట కు వెళుతున్న స్టీరింగ్ ఆటోను ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీ యూ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు, శోభ, స్వరూపలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నరసింహులుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బైక్‌పై వెళ్లింటే... స్వరూప, సుధాకర్ దంపతులు కూడా కూలీ పనుల నిమిత్తం పటాన్చెరు లింగంపల్లికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే కుమారులు స్వగ్రామంలో చదువుతుండగా.. వీరిని కమ్మరికత్తలో వదలాల ని దంపతులు నిర్ణయించారు. అందులో భాగంగానే సోమవారం సుధాకర్, ఇద్దరు కుమారులు బైక్‌లో బయలుదేరగా.. స్వరూప కుమార్తె నిఖితలు ఆటోలో బయలుదేరారు. అయితే స్వరూపను వృుత్యువు ఆటో రూపంలో కబలించగా.. నిఖిత స్వల్పగాయాలతో బయటపడింది. కాగా ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు పూర్తిస్థాయి సమాచారం కోసం సుధాకర్ మోబైల్‌కు ఫోన్ చేశారు. అతను సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బైక్‌లో అందరం వచ్చి ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే వారం కాదా అంటూ సుధాకర్ విలపించడం అక్కడివారిని కలిచివేసింది. గాయాలైన వారిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. రెండు వాహనాల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
‘గురుకులం’లోకి గుర్తు తెలియని యువకుడు
జోగిపేట, న్యూస్‌లైన్: మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువకుడు స్థానిక బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో చొరబడి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివా రం అర్ధరాత్రి ఒంటి గంటల ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు పాఠశాలలోని ఒకటవ అంతస్తులో ఎనిమిదో తరగతి విద్యార్థినులు ఉండే గదిలోకి ప్రవేశించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన విద్యార్థినులు పలువురు అలాగే పడుకున్నారు. అయితే సదరు యువకుడు గదిలోని లైట్లు వేయడం.. ఆర్పేయడంతో చేశారు. దీంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియ ని యువకుడు మౌనిక అనే అమ్మాయి కాళ్ల వద్ద పడకున్నాడు. దీంతో గదిలోని విద్యార్థినులు ఒక్కసారిగా అరుస్తూ బయటకు వచ్చేశారు. ఈ కేకలకు యువకుడు బయటకు పారిపోయాడు. దీంతో విషయాన్ని విద్యార్థినులు వాచ్‌మన్ నరసింహులకు తెలియజేశారు. ఆ రాత్రం తా విద్యార్థునులు జాగరణ చేశారు. పోలీసులకు ఫిర్యాదు : ప్రిన్సిపాల్ ఆదివారం అర్ధరాత్రి పాఠశాలలో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కే మాధురీ దేవి తెలిపారు. పాఠశాల అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వద్ద పనిచేసే డ్రైవర్‌గా తాము అనుమానిస్తున్నామన్నారు. పాఠశాల పరిసరాల్లో రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులను కోరినట్లు ఆమె తెలిపారు. పాఠశాలను సందర్శించిన తహ శీల్దారు, ఎస్ఐ సంఘటన వివరాలను తెలుసుకునేం దుకు అందోల్ తహశీల్దారు సీహెచ్ కృష్ణ య్య, ఎస్ఐ వై రవీందర్‌లు సోమవారం పాఠశాలను సందర్శించారు. సంఘటన వివరాలను విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌ల ను అడిగి తెలుసుకున్నారు. అనుమాని తునిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని ఎస్ఐ తెలిపారు.