బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే బాత్‌రూంలోకి వెళ్లిన ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కిందపడిపోయాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వివరించారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
43-ఉడేగోళంలో మేస్త్రీ..
కణేకల్లు : మండలంలోని 43-ఉడేగోళంలో ఎర్రగుంటలోని కెనిగుంటకు చెందిన వడ్డే హనుమంతరాయుడు(26) అనే మేస్త్రీ బుధవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఎస్‌ఐ యువరాజు తెలిపారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య రోజా, రెండేళ్ల కూతురు ఉన్నారు.