అనంతపురం న్యూటౌన్ : యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చే సి రూ.1000 కోట్లు కేటాయించాలని యాదవ మహా సభ ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. ఈ మేరకు ఆ దివారం స్థానిక రామనగర్‌లోని సంఘం కా ర్యాలయంలో యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నరసింహులు అధ్యక్షతన సర్వసభ్య స మావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావుయాదవ్, ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సామాజికంగా బలంగా ఉన్న కాపు వర్గాలకు రిజర్వేషన్లను కేటాయిస్తామనడం బీసీ వ్యతిరేక చర్య గా అభివర్ణించారు.
అనంతరం యాదవుల అ భివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రత్యేక తీర్మానాలను ఆమోదించారు. సోమవారం మంజునాథ కమిషన్ ఎదుట యాదవులు బీసీల వాణిని గట్టిగా వినిపించాలన్నారు. కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు నారాయణస్వామియాదవ్, రాజశేఖరయాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, చంద్రమోహన యాదవ్ పాల్గొన్నారు.
యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్
Published Sun, Oct 16 2016 11:46 PM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
Advertisement
Advertisement