special corporation
-
విమాన తయారీకి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్‌సభ ఆగస్ట్‌లో ఆమోదించింది. ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్‌బస్‌లకు భారత్ కీలక మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్వో) కార్యకలాపాలలో సైతం భారత్‌కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. -
హతవిధీ.. ఆర్టీసీ నిపుణుల కమిటీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభంతో మనుగడే ప్రశ్నార్థకం అవుతున్న ఆర్టీసీని బాగుచేసేందుకు ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీ కూడా చేతులెత్తేసింది. ఉన్నపళంగా సంస్థ బాగు పడాలంటే ఏం చేయాలనే విషయంలో సిఫారసులు చేసేందుకు 8 నెలల కింద ఏర్పాటైన కమిటీ ఇప్పటివరకూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేకపోయింది. అసలు ఆ కమిటీ గురించి పట్టించుకునే వారే లేకపోవటంతో కమిటీ సభ్యులు కూడా మిన్నకుండి పోయారు. ఆర్టీసీకి ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీ, చైర్మన్ లేకపోవటం కమిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంస్థను పర్యవేక్షించేవారు లేకపోవటంతో అధికారులు కూడా కమిటీకి సహకరించటం లేదని తెలుస్తోంది. విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్దామంటే, రవాణా శాఖ మంత్రి ఇటీవలే బాధ్యతలు స్వీకరించటం, వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో బిజీ కావటంతో కమిటీ సభ్యులు కలవలేకపోయారు. విచిత్రమేంటంటే.. మూడు నెలల కిందే నివేదిక సిద్ధమైనా, దాన్ని సమర్పించే ఆసక్తి కూడా సభ్యుల్లో నశించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎనిమిది మంది సభ్యులున్నారు. వారు అన్ని రకాలుగా సంస్థ పనితీరును పరిశీలించి సూచనలతో నివేదిక సిద్ధం చేశారు. కొంత సమాచారం కావాల్సి ఉండగా, ఆ వివరాలు చెప్పేందుకు అధికారు లు సహకరించట్లేదు. కమిటీలో కీలక బాధ్యత ల్లో ఉన్న ఈడీ మాత్రం నిరంతరం అందు బాటులో ఉంటున్నా.. ఓ ఉన్నతాధికారి సభ్యు లను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. పలు మార్లు సమయం కోరితే అతి కష్టమ్మీద ఒక్క సారి కలసి మొక్కుబడిగా సమావేశాన్ని ముగించారు. వారికే అంత పట్టింపు లేనప్పుడు తామెందుకు పట్టించుకోవాలన్న తీరులో సభ్యులున్నారు. నివేదికపై ఇప్పటికీ కొందరు సభ్యులు సంతకాలు కూడా చేయలేదు’అని కమిటీకి సహకరించిన ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు. గతంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన కర్ణాటక కాంగ్రెస్ నేత నాగరాజు కూడా కమిటీ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆ నివేదికపై ఆయన సంతకం చేసేందుకు కూడా ఆసక్తి చూపట్లేదట. ఇదీ నేపథ్యం.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మూడేళ్ల కింద ఆర్టీసీ తీరును సమీక్షించారు. అప్పట్లో ఆయన ఎన్నో సూచనలు చేశారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు యథావిధిగా సంస్థను సంక్షోభంలోకి నెట్టేశారు. అప్పట్లో ఎండీగా పనిచేసిన రిటైర్డ్ అధికారి రమణారావుకు ఈడీలతో సఖ్య త లేకపోవటం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థను బాగు చేసేందుకు కొంత వరకు కృషి చేసిన నాటి చైర్మన్ సోమారపు సత్యనారాయణకు, అప్పటి ఎండీకి మధ్య పొసగలేదు. దీంతో ఎండీ నుంచి సహకారం లేక సోమారపు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వాస్తవానికి ఆయన కృషి వల్లే నిపుణుల కమిటీ ఏర్పడింది. ఇక మళ్లీ సమీక్షలు కూడా లేకపోవటంతో పరిస్థితి బాగా దిగజారిపోయింది. కమిటీ సిఫారసుల్లో కొన్ని.. - ఆర్టీసీ నుంచి హైదరాబాద్ సిటీని విడదీసి.. మెట్రో రైలుతో కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందులో ఎంఎంటీఎస్ రైల్ నెట్‌వర్క్‌ను కూడా కలపాలి. - రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు సరిగా కొనట్లేదు. వెంటనే 1,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. నిధుల సమస్య ఉంటే విడతల వారీగా కొనాలి. సంస్థలో కాలం చెల్లిన బస్సులను పక్కనపెట్టాలి. వాటివల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఉన్న బస్సుల సామర్థ్యం పెరగాల్సి ఉంది. - కార్మికులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే తరచూ కార్మికులతో అధికారులకు వివాదాలు తలెత్తి వాటి ప్రభావం సంస్థ పనితీరుపై పడుతోంది. - సంస్థకు నిరంతరం పూర్తిస్థాయి ఎండీ ఉండాలి. అవగాహన ఉన్న వ్యక్తి చైర్మన్‌గా ఉండాలి. సంస్థపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పనితీరు బాగా దిగజారిపోతోంది. - తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పరిపాలన బోర్డు ఉండాలి. ఇది జరగాలంటే ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య పూర్తిస్థాయిలో విభజన జరగాలి. -
దివ్యాంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
దివ్యాంగుల చట్టం 2016ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పెరుగుతున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్‌ను 4 నుంచి 7 శాతానికి పెంచాలి. రాజ్యాంగంలో ఉన్న రాజకీయ రిజర్వేషన్‌ను 5 శాతం అమలు చేయాలి. దివ్యాంగులకు పూర్తి రాయితీతో రూ.5 లక్షల వరకు రుణాలు అందించాలి. ఇతర పనులు చేసుకోలేనివారికి నెలవారీ పెన్షన్ రూ.5 వేలు అమలు చేయాలి. దివ్యాంగుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందించాం. – కోరాడ అప్పలస్వామి నాయుడు, కొత్తలంక దేవుడు, వికలాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు -
విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్
అనంతపురం కల్చరల్ : బీసీ కులాల్లో అత్యంత వెనకబడిన విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని బ్రహ్మంగారి మఠం ఈశ్వరీ పీఠం శివకుమార్ స్వామీజీ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గురుప్రసాద్ నేతృత్వంలో ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక రాణీనగర్లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి శివకుమార్స్వామీజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, జడ్పీ చైర్మన్ చమన్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తమ జాతిని బీసీ ‘బి’ గ్రూపు నుంచి బీసీ ‘ఎ’ కి మార్చాలని, ప్రమాదవశాత్తు మరణించిన విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, శిల్పశాస్త్ర పరిజ్ఞానమున్న విశ్వబ్రాహ్మణులను ఆలయ ధర్మకర్తలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఆచారి, చంద్రశేఖారాచారి, రంగాచారి, విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు పూలకుంట రమణాచారి, హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు. -
పేద వైశ్యుల కోసం ఓ కార్పొరేషన్
వైశ్య ప్రముఖులతో వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పేద వైశ్యుల సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో ఓ కార్పొరేషన్ ఉండాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్య వైశ్య మహాసభ ప్రముఖులు పలువురు మంగళవారం జగన్ నివాసంలో ఆయన్ని కలుసుకుని ఓ వినతిపత్రం సమర్పించారు. ఏపీలో 70 శాతానికి పైగా వైశ్యులు పేదరికంలోనే ఉన్నారని జగన్ దృష్టికి తెచ్చారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తమ వారు రాణించాలంటే వారి కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్పొరేషన్ కావాలన్న తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు. జగన్ వారితో పూర్తిగా ఏకీభవించారు. సమాజ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేస్తున్న వైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు గట్టిగా కృషి చేస్తానని జగన్ చెప్పారు. ఇందు కోసం టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ఒకవేళ ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పని చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. -
యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్
అనంతపురం న్యూటౌన్ : యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చే సి రూ.1000 కోట్లు కేటాయించాలని యాదవ మహా సభ ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. ఈ మేరకు ఆ దివారం స్థానిక రామనగర్‌లోని సంఘం కా ర్యాలయంలో యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నరసింహులు అధ్యక్షతన సర్వసభ్య స మావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావుయాదవ్, ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సామాజికంగా బలంగా ఉన్న కాపు వర్గాలకు రిజర్వేషన్లను కేటాయిస్తామనడం బీసీ వ్యతిరేక చర్య గా అభివర్ణించారు. అనంతరం యాదవుల అ భివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి ప్రత్యేక తీర్మానాలను ఆమోదించారు. సోమవారం మంజునాథ కమిషన్ ఎదుట యాదవులు బీసీల వాణిని గట్టిగా వినిపించాలన్నారు. కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు నారాయణస్వామియాదవ్, రాజశేఖరయాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, చంద్రమోహన యాదవ్ పాల్గొన్నారు. -
కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
చిలమత్తూరు : కురుబ కులస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం కొడికొండ చెక్‌పోస్టులోని టూరిజం హోటల్లో కురుబ కులస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర ్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల ఫెడరేషన్‌కు కురుబలచే పాలకవర్గాన్ని నియమించి రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 27న కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వíß స్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రవీణ్, రమేష్, మురళీ, సుధాకర్, శివ, మురళి, మధు, రాము, నంజప్ప, మల్లికార్జున, జి.శివప్ప, శంకర్ ఉన్నారు. -
చెదిరిన ‘స్వగృహ’ కల
కొన‘సాగు’తున్న రాజీవ్ స్వగృహ నిర్మాణాలు ఇప్పటికి 16 మందే చేరిక.. మరికొద్ది మంది సిద్ధం నిర్మాణ ం పూర్తి అయిన ఇళ్లు 189 వాటిలో చేరేందుకు లబ్ధిదారుల అనాసక్తి డిపాజిట్ వాపసుకు 1300 మంది దరఖాస్తు ఎచ్చెర్ల:నిర్మాణాల్లో బాగా జాప్యం జరగడం, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో రాజీవ్ స్వగృహలో చేరేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. కొద్దిమంది ఇళ్లలో చేరినా అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లను వేలం వేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి ధరల్లో వాటిని కొనుగోలు చేసేందుకు ఎంతమంది ముందుకు వస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మధ్యతరగతి లక్ష్యంగా.. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉన్నతాశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించి, దీని పర్యవేక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని ఎస్.ఎం.పురం కొండపై సర్వే నెంబర్ 112లో 100 ఎకరాల స్థలం కేటాయించారు. అందులో 1094 ఇళ్లు నిర్మించి, దరఖాస్తుదారులకు రుణప్రాతిపదికన అందజేయాలని నిర్ణయించారు. ఆరు కేటగిరీలో నిర్మించే ఈ ఇళ్లకు నిర్ణయించిన ధరలు కూడా అందుబాటులో ఉండటంతో 5018 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.3వేలు చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించి ఆశగా ఎదురుచూశారు. వైఎస్ అనంతరం నిర్లక్ష్యం అయితే వైఎస్ మరణానంతరం ఈ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును దాదాపు మూలన పడేశాయి. 1094 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా తొలివిడతలో 200 ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. అయితే 189 నిర్మాణాలు ప్రారంభించి 54 మాత్రమే పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికి 16 ఇళ్లలో లబ్ధిదారులు చేరగా, మరికొందరు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగతా ఇళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.228 కోట్లు కేటాయించగా.. అందులో స్థలం చదును చేయడానికే రూ.24 కోట్లు వ్యయమైంది. విశాఖకు చెందిన ఎస్వీసీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రస్తుతం అనమిత్ర కార్పొరేషన్ చేపడుతోంది. కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించినా ప్రధానమైన రోడ్డు సౌకర్యం కల్పించలేదు. జాతీయ రహదారి నుంచి ఇళ్లు ఉన్న ప్రాంతానికి రావడానికే సరైన రహదారి లేదు. దీనికితోడు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులు స్వగృహపై ఆసక్తి చూపడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 1300 మంది ధరావత్తు సొమ్ము వాపసు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను వేలం వేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం వేలం నిర్వహించనుండటంతో ప్రభుత్వం మొదట ప్రకటించిన ధర కంటే సుమారు 30 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇంత ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బిల్లు.. ఇళ్ల కోసం.. ఎదురుచూపులు మరోపక్క ఇందిరమ్మ,ఆర్ పీహెచ్ వంటి ఇళ్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో రచ్చబండలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల బకాయిలు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు. అధికారంలోకి రాక ముందు లక్ష ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం నేతలు అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. జిల్లాలో 19 వేల మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తుండగా.. మరో 25 వేల మంది ఇళ్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరా అవాస్ యోజన(ఐఏవై) ఇళ్లు మంజూరు చేసేవారు. అలాగే మురికివా డల వారికి వాల్మీకి అంబేద్కర్ అవాస యోజన(వాంబే) ఇళ్లు ఇచ్చే వారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక ఇవేవీ అమలు కావడంలేదు.