విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి | couple died of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి

Published Mon, Jun 29 2015 8:35 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

couple died of vidyut shock

వైఎస్సార్ జిల్లా: టేబుల్ ఫ్యాన్ పక్కకు జరుపుతూ ప్రమాదవ శాత్తూ విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్‌జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని మల్లినేనిపట్నం కాలనీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కె. నరసింహులు (50), ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో పడుకునే సమయంలో టేబుల్ ఫ్యాన్‌ను పక్కకు జరుపుతుండగా.. సుబ్బలక్ష్మమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో నరసింహులుకు కూడా షాక్ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement