తాడ్వాయి: విందు కోసం బంధువుల ఇంటికి రాగా, సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దోమకొండ మండలం యాడారం గ్రామానికి చెందిన వడ్ల నరసింహులు (22) నందివాడలో బంధువుల ఇంటికి సోమవారం వచ్చాడు. అదే రోజు అర్ధరాత్రి సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో షాక్‌కు గురయ్యాడు. కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.