పావగడ : తాలూకాలోని జే అచ్చంపల్లి గ్రామానికి చెందిన శివన్న (20) అనే యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. శివన్న సోమవారం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం ఓ పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లితండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని వైఎన్ హొసకోట పోలీసులు తెలిపారు.