sivanna
-
చెరువులోకి పడి విద్యార్థి మృతి
రొళ్ల: చెరువులోకి జారిపడి శివన్న (13) అనే విద్యార్థి మృతి చెందిన ఘటన రొళ్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గురువారం సాయంత్రం ఎంఆర్ గొల్లహట్టిలోని బడిగి క్రిష్టప్ప, గిరిజమ్మ దంపతుల రెండో సంతానమైన శివన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం తోటి విద్యార్థులతో కలిసి చెరువు కట్టపైకి వెళ్లాడు. అయితే చెరువు గుంతలోకి ప్రమాదశాత్తు జారిపడటంతో శివన్నకు ఈతరాని కారణంగా నీటిలో మునిగిపోయాడు. తోటి విద్యార్థులు భయంతో ఇంటికి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శివన్న విగతజీవిగా మారిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లక్ష్మీనాయక్, జమేదార్బషీర్ అక్కడికి చేరుకుని ఘటనపై ఆరాతీశారు. వీఆర్ఓ శేఖర్‌కుమార్ ఎదుట పంచనామ నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
పావగడ : తాలూకాలోని జే అచ్చంపల్లి గ్రామానికి చెందిన శివన్న (20) అనే యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. శివన్న సోమవారం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం ఓ పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లితండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని వైఎన్ హొసకోట పోలీసులు తెలిపారు. -
శివన్న పంటా పోయింది!
అమడగూరు : స్వయాన సీఎం చంద్రబాటు రక్షకతడులను ప్రారంభించిన రైతు శివన్న పొలంలోనే వేరుశనగ పంట ఎత్తిపోయింది. చెట్టుకు ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. తొమ్మిది ఎకరాల పంట పూర్తిగా పోయిందని, పెట్టుబడి కోసం చేసిన రూ.లక్ష అప్పు ఎలా తీర్చాలోనని వాపోతున్నాడు. అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో ఆగస్టు 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లతో రక్షకతడులు ప్రారంభించారు. ఇక తన పంట పండినట్టేనని రైతు ఆశపడ్డాడు. పంటను శనివారం ట్రాక్టరుతో దున్నించేశాడు. దిగుబడి ఏమాత్రమూ లేదు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ శేషూరెడ్డి తదితరులు రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా అతను గోడు వెళ్లబోసుకున్నాడు. ‘టీడీపీ నాయకులు వచ్చి నీ పొలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు.. రక్షకతడుల ద్వారా పంటను కాపాడతారని చెప్పారు. సీఎం వచ్చిన రోజు కాసేపు రెయిన్గన్లు బిగించారు. ఆయన వెళ్లగానే అదే రోజు సాయంత్రం ఫారంపాండ్లోని కవరు, రెయిన్గన్లు అన్నీ తీసుకెళ్లిపోయారు. పంటంతా ఎండిపోయింద’ని వాపోయాడు. సీఎం వచ్చి రెయిన్గన్లను ప్రారంభించిన పంట పొలమే పూర్తిగా ఎండిపోతే..ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షక తడుల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టారే కానీ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శశికళ, నాయకులు సుధాకర్‌రాజు, రషీద్, మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, అంజినప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు. -
నా చావుకు మంత్రే కారణం..
మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీపై ఆరోపణలు బెంగళూరు: ‘నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్‌తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా న్యాయం చేయలేదు. నా చావుకు వీరే కారణం’ అంటూ తన మరణానికి ముందు వీడియో రికార్డ్ చేశాడు రామనగర జిల్లా మాగడి తాలూకా గవినాగమంగళ గ్రామానికి చెందిన రైతు శివణ్ణ(65). వివరాలు.. శివణ్ణ కుటుంబానికి అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతేకాదు శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఇక తన సమస్యకు పరిష్కారం లభించదని భావించిన శివణ్ణ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం తెల్లవారుఝామున శివణ్ణ మృతిచెందారు. మృతిచెందడానికి కాసేపటి ముందు శివణ్ణ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆయన కుటుంబ సభ్యులు వీడియో రికార్డ్ చేశారు. ‘నా మరణానికి మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీలు కారణం, అంతేకాదు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం.’ అని వీడియోలో రికార్డ్ చేశారు. ఇదే సందర్భంలో డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. -
సమయానికి వైద్యం అందక.. ఉద్యోగి మృతి
కర్నూలు : సమయానికి వైద్యం అందక.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి... ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివాసముంటున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి శివన్న(45) గురువారం ఉదయం వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అదుపు తప్పి ఆటో ఆయనను ఢీ కొట్టింది. దీంతో శివన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో.. సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో శివన్న మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆసుపత్రిపై వారు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. -
శివన్న స్వరహేళ