అమరాపురం : మండలంలోని ఆలదపల్లి గ్రామానికి చెందిన దాసప్ప కుమారుడు క్రిష్ణమూర్తి (30)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరు.. అతడు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు బేకరిలో పనిచేసేవాడు. ఆరు నెలల క్రితం సొంతంగా బేకరీని పెట్టాలనే ఉద్దేశంతో రూ.4 లక్షలు అప్పు చేసి అంగడి పెట్టాడు. అయితే వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో అధిక వడ్డీకి తెచ్చిన అప్పు ఎక్కువ కావడంతో ఎలా తీర్చాలో తెలియక కుటుంబ సభ్యుల వద్ద మధనపడేవాడు. శుక్రవారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి శనివారం బెంగళూరుకు ప్రయాణమయ్యాడు.
అయితే హల్కురు సమీపంలోని ఏపీఆర్‌ఎస్ పాఠశాల పక్కన వంక వద్ద పురుగుల మందు తాగి భార్యకు ఫోన్ చేశాడు. దీంతో వారు వచ్చి క్రిష్ణమూర్తిని మడకశిర ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. అతడికి భార్య మంజుళ ఎనిమిదేళ్ల పాపతో పాటు తల్లిదండ్రులు, సోదరులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఈరన్న ఆదివారం తెలిపారు. మృతదేహానికి మడకశిర ప్రభుత్వాసుప త్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
పురుగుల మందు తాగి..
Published Sun, Jun 25 2017 11:30 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement