శుభఘడియలు సమీపిస్తుండగా కాబోయే వరు డు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపం
చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించిన వైనం
తాడిపత్రి రూరల్: శుభఘడియలు సమీపిస్తుండగా కాబోయే వరు డు ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా మూడ్రోజుల్లో పెళ్లి ఉం దనగా అతను ఉరేసుకోవడం కలకలం రేపింది. ఈ సంఘటన తాడిపత్రి మండలం సజ్జల దిన్నెలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రాముల మ్మ, ఓబులేసు దంపతుల కుమారుడు రమేష్(24) గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు.
రూ రల్ ఎస్‌ఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం... వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలానికి చెందిన ఓ యువతితో ఈ నెల 21న రమేశ్ పెళ్లి నిర్ణయించారు. పెళ్లి కార్డులు కూడా ప్రిం ట్ చేయించి అందరికీ స్వయంగా తనే పంచిపెట్టాడు. ఈ నేపథ్యంలోనే నీళ్లు తెస్తానంటూ బిందెలు తీసుకుని ఇంటి నుంచి వ్యవసాయ పొలాల వద్దకు బయలుదేరిన రమేశ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుం బ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతన్ని వెతుక్కుంటూ పొలా ల వద్దకు బయలుదేరా రు.
అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో కుప్పకూలి పోయారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ సంఘటన రెండు గ్రామాల్లో విషాదం నింపింది.


