పవన్ ట్వీట్లపై నేను వ్యాఖ్యానించను: మంత్రి | manikyalarao statement on pawan tweets | Sakshi
Sakshi News home page

పవన్ ట్వీట్లపై నేను వ్యాఖ్యానించను: మంత్రి

Published Sat, Aug 22 2015 1:34 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ ట్వీట్లపై నేను వ్యాఖ్యానించను: మంత్రి - Sakshi

పవన్ ట్వీట్లపై నేను వ్యాఖ్యానించను: మంత్రి

పశ్చిమగోదావరి: సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పై తాను మాట్లాడదలచుకోలేదని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన నూతన రాజధాని నిర్మాణానికి రైతులు ఒప్పుకోకపోయినా భూసేకరణ తప్పదని చెప్పారు. రాజధాని నిర్మాణం కావాలంటే భూమాలు కావాల్సిందేనని తేల్చి చెప్పారు.

పార్లమెంటులో భూసేకరణ చట్టాన్ని అన్యాయంగా అడ్డుకున్నది కాంగ్రెస్సేనని ఆయన మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ నేతలకు రోడ్డుపై తిరిగే పరిస్థితి కూడా ఉండదని విమర్శించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఛీకొట్టినా వారికి బుద్ధి రాలేదని మంత్రి మాణిక్యాలరావు ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement