
మారుతి వ్యాన్ నుంచి చెలరేగిన మంటలు
కాకినాడ: నడుస్తున్న మారుతి వ్యాన్లోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. చీరల లోడ్తో ఓ వ్యాన్ వెళ్తోంది. అయితే, జగ్గంపేట సమీపానికి మారుతి వ్యాన్ రాగానే రోడ్డుపై పడి ఉన్న ఎండుగడ్డిపై నుంచి వెళ్లింది. దీంతో ఎండుగడ్డి కారు ఇంజన్లో ఇరుక్కోవడంతో చిన్నగా మంటలు ప్రారంభమయ్యాయి.
ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ వ్యాన్ను రోడ్డు పక్కన ఆపేశాడు. దీంతో అతడికి ఏ ప్రమాదం జరగలేదని సమాచారం. అనంతరం కొన్ని నిమిషాల్లోనే మారుతీ వ్యాన్ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో రూ.5 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.