గరిష్ట స్థాయికి జీడీపీ నీటిమట్టం
Published Tue, Aug 2 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
– హంద్రీకి నీటి విడుదలకు అవకాశం
– తీర గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలపై దండోరా
గోనెగండ్ల:
గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎప్పుడైనా క్రస్ట్‌గేట్లు ఎత్తి హంద్రీలోకి నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్ అధికారులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించి జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, జలవనరుల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు నుంచి ఉత్తర్వులు పొందారు. దీంతో హంద్రీ తీర ప్రాంతాలైన హెచ్.కైరవాడి, గాజులదిన్నె తదితర గ్రామాల్లో రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు. అలాగే పోలీసులు కూడా గ్రామీణులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో 377 మీటర్ల నీటిని నిలువ చేసే సామర్థ్యం ఉండగా సోమవారం సాయంత్రానికి 376.77 మీటర్ల నీటిమట్టం నమోదైంది. 376.80 మీటర్లకు పైగా నీటి మట్టం నమోదైతే అదనంగా వచ్చిన నీటిని హంద్రీలో వదులుతామని జీడీపీ డీఈ లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్ట్ క్యాచ్‌మెంట్ ఏరియాలో ఏమాత్రం వర్షం వచ్చినా అవి ప్రాజెక్ట్‌లో చేరి ప్రమాదస్థాయి దాట వచ్చని పేర్కొన్నారు. హంద్రీ పరీవాహక ప్రాంత వాసులు హంద్రీవైపు వెళ్ల వద్దని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement