మాయ మాటలతో ఓట్లడుగుతారు | Maya matalato otladugutaru | Sakshi
Sakshi News home page

మాయ మాటలతో ఓట్లడుగుతారు

Published Mon, Sep 26 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

మాయ మాటలతో ఓట్లడుగుతారు

మాయ మాటలతో ఓట్లడుగుతారు

– గడప గడపకు వైఎస్సార్‌లో ప్రజల ఆవేదన
పోరుమామిళ్ల: ‘ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి ఓట్లు అడుగుతారు.. ఆ తర్వాత కనపబడరు.   మాకు పక్కా ఇళ్లు, రోడ్లు, రేషన్‌కార్డులు లేవు. మా సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని’  మండలంలోని యరసాల హరిజనవాడ మహిళలు  వాపోయారు. సోమవారం గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, అధికారప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు,  జెడ్పీటీసీ సభ్యురాలు శారదమ్మ, తదితరులు ఫాతిమాపురం, యరసాల హరిజనవాడ, గురునగర్‌లలో  ఇంటింటా తిరిగి చంద్రబాబు ఇచ్చిన హామీలపై కరపత్రాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా  గొంగటి చెన్నమ్మ, మాంచాలి, గంటా రమణమ్మ, బాలసుబ్బమ్మ, లక్షుమ్మ, నర్సమ్మ, కొట్టం నర్సమ్మ, చాటకొండు కమలమ్మ  తదితరులు మాట్లాడుతూ ఇప్పటì కీ మాకు ఒక్క పక్కా ఇళ్లు రాలేదన్నారు. వీధుల్లో రోడ్లు లేక నాలుగు చినుకులు పడితే బురదలో, గుంతల్లో అవస్థలు పడుతున్నామన్నారు. రేషన్‌కార్డు కోసంఎన్ని సార్లు అర్జీలు ఇచ్చుకున్నా అతీలేదు, గతీ లేదన్నారు.  కార్యక్రమంలో ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు రవిప్రకాష్‌రెడ్డి, పార్టీ మండల అ«ధ్యక్షుడు సియం బాషా, రాజాసాహేబ్‌పేట, యరసాల సర్పంచులు లక్ష్మినారాయణ, రామలక్ష్మిరెడ్డి,  నాయకులు రామసుబ్బారెడ్డి (మాజీసర్పంచ్‌), హరిశ్చంద్రారెడ్డి, రవిచంద్రారెడ్డి ,  చాపాటి లక్ష్మినారాయణరెడ్డి, అల్లా, ఖాజావలి, మహబూబ్‌పీర్, కొండయ్య, వెంకటేశ్వర్లు, రఘురాముడు, మాల్యాద్రి, హరిశ్చంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రవిచంద్రారెడ్డి, శేషిరెడ్డి, రామిరెడ్డి,  గిరిప్రణీత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement