Gadapa Gadapaku Ysr
-
గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రులు,ఎమ్మెల్యేలు
-
‘చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ’
-
‘చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ’
చిట్టమూరు: చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మర్లాంలో సోమవారం జరిగిన గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అని పార్టీ ప్రధాన కార్యదర్వి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులను అంగడి సరకుల్లా కొనుగోలు చేసిన చంద్రబాబు ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిప్పు కాదు..తుప్పు..!
-
15 నుంచి గడపగడపకూ వైఎస్సార్
పిడుగురాళ్ల పట్టణం నుంచి ప్రారంభం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు (గుంటూరు): ఈ నెల 15వ తేదీన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని 29, 30 వార్డులో నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన కాసు మహేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తితో కలిసి గడప, గడపకూ వైఎస్సార్ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే గడప గడపకూ వైఎస్సార్ జరుగుతోందన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మా దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గడపగడపకూ వైఎస్సార్ జరుగుతోందని పేర్కొన్నారు. కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లేలా..ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 15న ప్రారంభం కానున్న కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్యఅతిథులు రానున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పలువురు జెడ్పీటీసీలు, నేతలు పాల్గొన్నారు. -
గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంపై సమీక్ష
హైదరాబాద్: గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో సోమవారం ఉదయం శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. అనంతరం విశాఖ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో మంగళవారం కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. -
‘వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారు’
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని వైఎస్ఆర్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హోదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బాలినేని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజిలు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని బాలినేని విమర్శించారు. ఒంగోలు ఇస్లాంపేటలో సోమవారం జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ విశాఖలో వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఎంత బలంగా ఉందో, సభకు వచ్చినవారిని చూస్తే తెలుస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని బాలినేని సూచించారు. -
మైదుకూరులో గడప గడపకు వైఎస్ఆర్
-
కదిరిలో గడప గడపకు వైఎస్ఆర్సీపీ
-
విశాఖ జిల్లాలో జోరుగా గడపగడపకూ YSR
-
సూరాపురంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం
-
వడ్డీలు కట్టలేక సస్తాన్నాం
కడప కార్పొరేషన్: ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వస్తానే మాఫీ చేస్తారేమోనని అనుకున్నాం. యాడ చేశారు సార్.. రుణాలు మాఫీకాక.. వడ్డీలు కట్టలేక సస్తాన్నం’ అంటూ మహిళలు వాపోయారు. శుక్రవారం స్థానిక 9వ డివిజన్లో గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మేయర్, ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒనగూరుతున్నSలబ్ధి ఏమిటో తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కాగృహాలు, రుణాలేమైనా వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. దీనికి వారు స్పందిస్తూ తమకు ఎలాంటి పథకాలు అందలేదని కుండబద్దలు కొట్టారు. అనంతరం మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు 600 హామీలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. టీడీపీకి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి మల్లికార్జున కిరణ్, నాయకులు ఆర్ ఎన్ బాబు, మురళీ, సీహెచ్ వినోద్, నాగేంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, నాగమల్లారెడ్డి, శ్రీరంజన్, పత్తిరాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, బోలా పద్మావతి, రత్నకుమారి పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
– ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాజుపాళెం(చాపాడు): గడప గడప వైఎస్సార్సీపీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికెళ్లినా ప్రభుత్వంపై ప్రజల్లో నిరసన జ్వాలలు, వ్యతిరేకత ఎదురవుతున్నట్లు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజుపాళెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమావేశాల్లో స్వయంగా చంద్రబాబునాయుడే తమ పార్టీ నేతలు చేస్తున్న తప్పులను ప్రస్తావించారన్నారు. ఇసుక మాఫీయాలో తెలుగుతమ్ముళ్లు కూరుకుపోయారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. కొన్ని వేల పింఛన్లు వచ్చినా అవన్నీ చనిపోయిన వారి పేరుపై ఉన్నాయని, తమ పార్టీ నాయకులే దోచుకుంటున్నారని సీఎం చెప్పాడన్నారు. చంద్రబాబునాయుడు కేవలం దిష్టిబొమ్మలా ఉన్నాడని, ఆయన కొడుకు లోకేషే అంతా నడుపుతున్నాడన్నారు. టీడీపీలో ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, బీసీ మండల కన్వీనర్ రామచంద్రయ్య, పెద్దశివ, గాంధీనగరం నాగసుబ్బారెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో కనీస సౌకర్యాలు కరువు
– గడప గడపకు వైఎస్సార్‌లో సమస్యల వెల్లువ బి.కోడూరు : గ్రామాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, వీధిదీపాలకు కూడా తాము నోచుకోలేదని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఎదుట తంగేడుపల్లె వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని తంగేడుపల్లె, తంగేడుపల్లె బీసీకాలనీ, ఎస్సీకాలనీ, తుమ్మలపల్లె, తుమ్మలపల్లె ఎస్సీకాలనీల్లో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తంగేడుపల్లె ఎస్సీకాలనీ వాసులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా తమ కాలనీలో, గ్రామంలో ఎక్కడ కూడా వీధిదీపాలు వెలగలేదన్నారు. రాత్రివేళలో విషపురుగులు సంచరిస్తున్నాయని, అంతేకాకుండా పలువురు ప్రమాదాలకు కూడా గురయ్యాయని వారు వాపోయారు. ఓట్లు వేయించుకుని గెలిచిన ప్రజాప్రతినిధులు తమగోడును పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పక్కా ఇళ్ల కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు. సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికీ వైఎస్ హయాంలో ఏ విధంగా ఇళ్ల నిర్మాణం జరిగిందో అదేవిధంగా పక్కాఇళ్లు అందించి పేదవారి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. టీడీపీ నాయకుల మాదిరి అలివికాని హామీలను చెప్పి మాట తప్పడం జగన్మోహన్రెడ్డికి చేతకాదని, చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తారన్నారు. ఎన్నికలప్పుడు మళ్లీ మీ వద్దకు టీడీపీ నేతలు వస్తారు, అప్పుడు వారిని నిలదీసి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామక్రిష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వై.యోగానందరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు శివశంకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, రాజారెడ్డి, కేశవరెడ్డి, శేషారెడ్డి, వై.సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, రాజా, గుర్రయ్య, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
హామీలను నమ్మి మోసపోయాం
బి. కోడూరు: చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయామని స్థానిక ప్రజలు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెంకటసుబ్బయ్య ఎదుట మొరపెట్టుకున్నారు. బుధవారం మండలంలోని మేకవారిపల్లె, మేకవారిపల్లె పాతూరు, రెండు ఎస్సీకాలనీలు, శ్రీరామ్‌నగర్ గ్రామాల్లో గడపకు గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల ఎదుట గ్రామాల్లోలోని ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. టీడీపీ ఎన్నికలకు పక్కా ఇళ్లు , వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, ఉచిత విద్యుత్తును అందిస్తామని చంద్రబాబు చెప్పిన హామీలను నమ్మి నిలువునా మోసపోయామన్నారు. బంగారుపై తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయకపోవడంతో బంగారును వేలం వేసుకునే పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయకర్త వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎంతసేపు టీడీపీ ప్రభుత్వం వారి కార్యకర్తల లబ్ధికోసం పనిచేస్తోంది తప్ప సామాన్య ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వై.యోగానందరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచు పీ.లక్ష్మీనరసారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు ఎస్.బాలసుబ్బారెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ గంటాసుబ్బిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పీ.వెంకటసుబ్బారెడ్డి, మాధవరెడ్డి, ప్రహల్లాదరెడ్డి, ఎరుకలయ్య, డి.చెన్నయ్య, శేఖర్, నారాయణ, కిట్టయ్య, పీ.జయపాల్, డి.జయరామ్, తిరుపాలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రక్తం మరగడం ఆగిందా బాబూ!
సాక్షి, కడప: ప్రత్యేక హోదాపై రక్తం మరుగుతోందని.. నెలక్రితం చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మరగడం ఆగిపోయిందా.. అందుకే ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని కొత్త పల్లవి ఎత్తుకున్నారా..అంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం మల్లేల గ్రామంలో గడపగడపకు వైఎస్ఆర్ ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన బహిరంగసభలో అవినాష్‌రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని... అంతేకాకుండా రాయితీలు వర్థించడంతో ఎక్కువగా పరిశ్రమలు వస్తాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి ఇంటి సమస్యగా భావించాలని.. అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు చెంపపై గట్టిగా చెల్లుమనిపించేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని.. 2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాయలసీమ సాగు నీటి విషయంలో చంద్రబాబుకు ఎంతమాత్రం చిత్తశుద్ధిలేదని అన్నారు. పట్టిసీమ ద్వారా రైతులకు నీరు ఇవ్వడమంటే మోసం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను దివంగత సీఎం వైఎస్ఆర్ 11వేల క్యూసెక్కులనుంచి 44వేల క్యూసెక్కుల నీరు తీసుకొచ్చేలా విస్తరణకు శ్రీకారం చుట్టారని.. తెలంగాణా, కోస్తాంధ్ర ప్రజలు వ్యతిరేకించినా అప్పట్లోనే 80శాతం పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 20శాతం పనులను అటు కాంగ్రెస్, ఇటు అధికారంలో ఉన్న టీడీపీ పనులు పూర్తి చేయకపోవడం చూస్తే సీమ ప్రాజెక్టులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందన్నారు. దీనిని విస్తరించి ఉంటే శ్రీశైలంలో జలం ఉంటే మన ప్రాజెక్టులకు నీరు వచ్చేవని.. గండికోటలో 27టీఎంసీల నీరు నిల్వ చేస్తే జిల్లా సస్యశ్యామలంగా మారేదని అన్నారు.. మైకు ఇస్తే గొప్పలు చెప్పుకొనే టీడీపీ నాయకులు ఎందుకు ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం విస్మరించిందో చెప్పాలన్నారు. -
వ్యవస్థను సర్వనాశనం చేసిన బాబు
– మల్లేల బహిరంగ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజం సాక్షి, కడప/పులివెందుల/తొండూరు : రైతులు.. డ్వాక్రా మహిళలు.. నిరుద్యోగులు.. ఉద్యోగులు ఇలా అందరూ మోసానికి గురయ్యారు... ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.. కనీసం కష్టాలలో ఉన్న వారికి భరోసా కూడా కల్పించలేదు.. బాబు సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది... గెలిచిన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి.. పట్టుమని పది ఓట్లు కూడా రాని ఓడిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి వేదికలపై కూర్చోబెట్టడం.. ఏ అర్హతలేని వారిని జన్మభూమి కమిటీలో సభ్యులంటూ పథకాల్లో పెత్తనం చలాయించేలా జీవో తీసుకొచ్చి వ్యవస్థలనే చంద్రబాబు సర్కార్ సర్వనాశనం చేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం తొండూరు మండలం మల్లేల గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ ముగింపు కార్యక్రమం సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పల్లెసీమల్లో గడపగడపకు వైఎస్ఆర్పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిదని.. ప్రారంభంనుంచి అయిపోయేవరకు ఒక్క పండుగలా ప్రతి ఇంటినుంచి వచ్చి ప్రజలు పాల్గొంటుండటం మరిచిపోలేని అనుభూతి అని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీపై ఉన్న అభిమానం అందరిని కదిలేలా చేస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున కదిలి వస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పింఛన్ల తొలగింపుపై లోకాయుక్త కోర్టును ఆశ్రయిస్తాం: చాలామంది జన్మభూమి కమిటీల పుణ్యమా అని పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తొలగింపునకు గురైన వితంతు, వృద్ధాప్య, ఇతర ఏ పింఛన్లు అయినా అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలని..తద్వారా లోకాయుక్త కోర్టును ఆశ్రయించి న్యాయం పొందనున్నట్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలియజేశారు. ఎవరూ బాధపడొద్దని.. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు. -
మాయ మాటలతో ఓట్లడుగుతారు
– గడప గడపకు వైఎస్సార్‌లో ప్రజల ఆవేదన పోరుమామిళ్ల: ‘ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి ఓట్లు అడుగుతారు.. ఆ తర్వాత కనపబడరు. మాకు పక్కా ఇళ్లు, రోడ్లు, రేషన్‌కార్డులు లేవు. మా సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని’ మండలంలోని యరసాల హరిజనవాడ మహిళలు వాపోయారు. సోమవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, అధికారప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యురాలు శారదమ్మ, తదితరులు ఫాతిమాపురం, యరసాల హరిజనవాడ, గురునగర్‌లలో ఇంటింటా తిరిగి చంద్రబాబు ఇచ్చిన హామీలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొంగటి చెన్నమ్మ, మాంచాలి, గంటా రమణమ్మ, బాలసుబ్బమ్మ, లక్షుమ్మ, నర్సమ్మ, కొట్టం నర్సమ్మ, చాటకొండు కమలమ్మ తదితరులు మాట్లాడుతూ ఇప్పటì కీ మాకు ఒక్క పక్కా ఇళ్లు రాలేదన్నారు. వీధుల్లో రోడ్లు లేక నాలుగు చినుకులు పడితే బురదలో, గుంతల్లో అవస్థలు పడుతున్నామన్నారు. రేషన్‌కార్డు కోసంఎన్ని సార్లు అర్జీలు ఇచ్చుకున్నా అతీలేదు, గతీ లేదన్నారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రవిప్రకాష్‌రెడ్డి, పార్టీ మండల అ«ధ్యక్షుడు సియం బాషా, రాజాసాహేబ్‌పేట, యరసాల సర్పంచులు లక్ష్మినారాయణ, రామలక్ష్మిరెడ్డి, నాయకులు రామసుబ్బారెడ్డి (మాజీసర్పంచ్), హరిశ్చంద్రారెడ్డి, రవిచంద్రారెడ్డి , చాపాటి లక్ష్మినారాయణరెడ్డి, అల్లా, ఖాజావలి, మహబూబ్‌పీర్, కొండయ్య, వెంకటేశ్వర్లు, రఘురాముడు, మాల్యాద్రి, హరిశ్చంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రవిచంద్రారెడ్డి, శేషిరెడ్డి, రామిరెడ్డి, గిరిప్రణీత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలేవీ?
కడప అగ్రికల్చర్ : రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలకు దూరమయ్యామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు గురువారం గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొండూరు మండలం గంగాదేవిపల్లె, ఊడవగండ్లల్లో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ కరువు నేపథ్యంలో రాజశేతుసాగర్ ద్వారా నీరు ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో కరెంటు బిల్లులు ఎప్పుడు కూడా ఎక్కువ రాలేదని, ఈ ప్రభుత్వంలో తలకుమించిన భారంగా మారాయని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. బీకోడూరు మండలం పెదుళ్లపల్లెలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ప్రజలు మాట్లాడుతూ రెండున్నరేళ్లు అవుతున్నా గ్రామానికి ఒక్క పక్కాగహం మంజూరుకాలేదన్నారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయితీలోని అరేపల్లె, గాంధీనగర్‌ల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్లను నిర్మించుకుంటే బిల్లులు రాలేదని మహిళలు వాపోయారు. డ్వాక్రా రుణాలు మాఫీకాక పోవడంతో వడ్డీతో సహా కట్టలేకపోతున్నామని ఆవేదనతో తెలిపారు. రోడ్లు నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. -
జిల్లాలో ఏమిటీ నియంతృత్వం
రాచరిక పాలన సాగుతోంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే రాజా ధ్వజం గొల్లప్రోలు : జిల్లాలో రాచరికవ్యవస్థ కన్నా ఘోరంగా నియంతృత్వ ధోరణితో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. మండలంలోని తాటిపర్తి గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సందర్భంగా పిఠాపురం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో తొలుత కన్నబాబు మాట్లాడుతూ రాజులపాలన గుర్తుతెచ్చే విధంగా జిల్లాలో పాలన సాగుతోందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా అధికారపార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై పోలీసులచే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలపై పోరాడడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కన్నీళ్లు కార్చి కన్నెర్ర జేస్తున్న వర్మ... నాడు ఓట్లు కోసం కన్నీరు కార్చిన ఎమ్మెల్యే వర్మ అధికారంలోకి వచ్చాక ప్రజలపై కన్నెర్ర చేస్తూ హింసిస్తున్నాడని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఏడ్చే నాయకులను నమ్మవద్దన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని నాయకులు నీరు, మట్టి, ఇసుకను అమ్ముకుని దందాను సాగిస్తున్నారని, చివరకు గాలిని కూడా అమ్ముకోవడానికి వెనుకాడరన్నారు. వైఎస్సార్ సీపీ కాకినాడ నియోజకవర ్గకన్వీనర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగుతోందన్నారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, కాకినాడ సిటీ పార్టీ కన్వీనర్లు ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, మండల కన్వీనర్ అరిగెల రామయ్యదొర, స్థానిక నాయకులు దాసం వెంటకలక్ష్మి, ఎంపీటీసీ గారపాటి శ్రీనివాసరావు, బుజ్జి, దాసం కామరాజు, గోవిందు, సామినీడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనకు జీరో మార్కులేస్తాం
-
'గడప గడపకు'పై రేపు సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ప్రజలను కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బృహత్ కార్యక్రమం 'గడప గడపకు వైఎస్ఆర్'పై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష జరపనున్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ సమీక్ష ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమీక్ష సమావేశంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొంటారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీ నుంచి ప్రారంభమైన 'గడప గడపకు వైఎస్ఆర్' ఎలా సాగుతోందన్న అంశంపై సవివరంగా చర్చిస్తారు. -
‘గడప గడపకూ వైఎస్సార్’
-
ప్రజలలో తిరుగుబాటు
సాక్షి, కడప: చంద్రబాబు చెబుతున్న.. చేస్తున్న మోసాలపై ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందని.. త్వరలోనే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రాజంపేటలోని ఉస్మాన్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి.. గోపవరం మండలం రాచాయపేటలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఓబుళవారిపల్లె మండలం గద్దెలరేవుపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలనుంచి ఎక్కడ చూసినా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. ఇప్పటికైనా చంద్రబాబు గుర్తెరిగి ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని సూచించారు. రాష్ట్రాన్ని ఎంతోమంది పరిపాలించారని.. కానీ ఇంత ఘోరంగా పరిపాలించిన ముఖ్యమంత్రులెవరూ లేరని ధ్వజమెత్తారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోందని.. ప్రజలు కూడా టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారని వారు తెలిపారు. నేడు పలుచోట్ల గడప గడపకు వైఎస్ఆర్ : గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపవరం మండలంలోని సండ్రపల్లె గ్రామంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త వెంకటసుబ్బయ్య పాల్గొననున్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 12వ వార్డులో బుధవారం మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టనున్నారు. రాజంపేట పరిధిలోని ఎర్రబల్లెలో జిల్లా ఆధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరగనున్నారు. ఓబుళవారిపల్లె మండలం బొల్లవరం, బీపీ రాజుపల్లెల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డిలు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బాబు మోసాలను ఎండగట్టనున్నారు. -
చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు?
విశాఖపట్నం: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఎన్నికలయ్యాక ఆయన ఏం చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. విశాఖపట్నం జిల్లా మునగపాకలో సోమవారం జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎవర్నీ వదలిపెట్టకుండా హామీలు ఇచ్చాడని, గెలిచాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వైఎస్ జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరం తీరిపోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు మేలు చేయని ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని ప్రశ్నించారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తిని నిలదీయాలని ప్రజలను కోరారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పారు జాబు రావాలంటే బాబు రావాలన్నారు ఇల్లులేని వారికి ఇల్లు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు చంద్రబాబు ఎవర్నీ వదిలిపెట్టకుండా హామీలిచ్చారు అబద్ధపు హామీలతో ముఖ్యమంత్రి అయ్యారు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? చివరకు నిరుద్యోగభృతి కూడా ఇవ్వడం లేదు అబద్ధాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రాజకీయ వ్యవస్థను దిగజార్చారు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఇదే విషయం అడిగాం చంద్రబాబు పాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరాం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలానా చేస్తానని చెప్పిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరం తీరిపోయిందని భావించి, ప్రజలకు మేలు చేయకుంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి అయితే ఏం చేసినా నడుస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తిని నిలదీయాలి ఎన్నికలపుడు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావని బాబును నిలదీయాలి అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది దీనికోసమే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టాం చంద్రబాబు పాలనలో జరుగుతున్న మోసాలను నిలదీయాలని పార్టీ నేతలకు చెప్పాను ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వచ్చిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా -
ప్రజల గోడు పట్టని ప్రభుత్వమిది
♦ గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో నేతల ♦ ఎదుట ప్రజల ఆవేదన కడప అగ్రికల్చర్ : ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వానికి అసలు పట్టడం లేదని గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో నేతల ఎదుట ప్రజలు వాపోతున్నారు. శుక్రవార గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల నియోజవర్గంలోని సింహాద్రిపురంలో అహోబిలం, రావులకోలను గ్రామాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుఢు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకరరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ అరవిందనాధరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి పార్టీ ముద్రించిన కరపత్రాలను ఇచ్చి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. గ్రామానికి చెందిన భాస్కరెడ్డి రైతు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ రాదని, బీమా ఇప్పించలేరని దుయ్యబట్టారు. మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండలంలోని ముడిమాల, కేశాపురం, సిద్దయ్యమఠం గ్రామా ల్లో ఇంటింటికి ఎమ్మెల్యే చెట్టిపల్లె రఘురామిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి, ఎంపీపీ చక్రవర్తి, ముఖ్యనేతలు వెళ్లారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించారని, ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అలాగే రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలోని చాపలవారిపల్లె, చుక్కాయపల్లె గ్రామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి, పార్టీ జిల్లా పరిశీలకుడు నరసింహారెడ్డి, సౌమిత్రి, మాజీ సర్పంచ్ భీమయ్య గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాలనను అడిగి తెలుసుకునే సమయంలో గ్రామానికి చెందిన మహిళ కూలీ గంగోజీ మాట్లాడుతూ ఫించన్లు తొలగిం చడంతో కుటుంబ పోషణ కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలంలోని గిరినగర్ కాలనీ, సుందరయ్య కాలనీల్లో ఇంటింటికి పార్టీ నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ విజయప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ సిద్దమ్మ, పార్టీ మండల కన్వీనర్ సి భాషలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తుండగా కాలనీకి చెందిన గంగయ్య తమకు ఇళ్లు లేదని ఇళ్లు మంజూరు చేయాలని వినిపత్రాలు ఇవ్వడానికి కాళ్లరిగేలా తిరిగి అలసిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, మున్సిపాలిటీలోని నేతలు పాల్గొని ఇంటింటి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. -
ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ కార్గవర్య సమావేశం ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లే విషయంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. -
నాయకులు కావాలంటే ఇదే సీక్రెట్
► నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లండి ► వారి యోగక్షేమాలు కనుక్కోండి ► చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారో చూడండి ► పనిలో పనిగా బూత్ కమిటీలు కూడా నియమించండి ► ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన ► ఐదేళ్లుగా అలుపులేని పోరాటం ► అడుగడుగునా అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు ► చంద్రబాబుకు, మనకు ఓట్ల తేడా 5 లక్షలే ► 13 రీళ్ల వరకు విలన్‌దే పై చేయి గానీ.. 14వ రీల్లో హీరో రివర్స్ అవుతాడు ► నాయకులు మోసాలు చేస్తే చెప్పులు, చీపుర్లు చూపించండి ► వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బతకదు ► ముద్రగడ పద్మనాభం దీక్షకు పూర్తి సంఘీభావం ► విజయవాడలో ఘనంగా ముగిసిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడ నాయకులు కావాలంటే తండ్రులో.. తాతలో ఎమ్మెల్యేలు కావాల్సి అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాయకులు కావాలంటే తాను ఒక సీక్రెట్ చెబుతానన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికీ వెళ్లాలని.. 'గడప గడపకూ వైఎస్ఆర్' అనే ఈ కార్యక్రమాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే... ఈరోజు వివిధ జిల్లాల నుంచి విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు, కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు అందరికీ.. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ.. అడుగులో అడుగు వేసి తోడుగా ఉన్నామని చెప్పినందుకు అందరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాం మన పార్టీ స్థాపించి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే వస్తున్నాం ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ అధ్యక్షుడిగా నేను స్పందిస్తూనే ఉన్నా పార్టీపరంగా కూడా ఎవరూ వెనకడుగు వేయకుండా ప్రజలకు అండగా ఉన్నా ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆయన పోయాడో పోలేదో గానీ, ఎవరికి ఏసమస్య వచ్చినా జగన్ వారికి అండగా ఉన్నాడు ఐదేళ్లు ఇదే పోరాటం చేశాం, అంచెలంచెలుగా పార్టీ ఎదిగింది తొలుత అమ్మ, నేను ఇద్దరమే గెలిచాం. తర్వాత 18 మందికి వెళ్లాం, తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో బలోపేతం అయ్యాం. రాష్ట్రంలో 1.30కోట్ల మంది మనకు అండగా నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చినవి 1.35 కోట్లయితే, మనకు వచ్చినవి 1.30 కోట్ల ఓట్లు.. వారికి, మనకు మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి, ఆయన తినని గడ్డి లేదు, చేయని మోసం లేదు, చెప్పని అబద్ధం లేదు చంద్రబాబు సీఎం అయితే అయ్యారు గానీ, అందుకు ఆయన చెప్పిన అబద్ధాలే సహకరించాయి ఏ మీటింగులోనూ ఆయన రైతులను వదిలిపెట్టలేదు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను మోసం చేశారు ఫ్లెక్సీలకు లైట్లు పెట్టించి మరీ చదువుకునే పిల్లలనూ మోసం చేశారు ఖాళీ గోడలు కనపడితే చాలు.. వాటిమీద రాతలు రాశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఇంటికి వెళ్లి టీవీ చూస్తే.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, లేకపోతే ఇంటింటికీ 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు సీఎం అయిన నెలలోనే రైతు రుణాలన్నీ పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానన్నారు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీకావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు మన చెవుల్లో ఈనాటికీ రింగురింగున మోగుతూనే ఉన్నాయి బాబు సీఎం అయ్యాడు.. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రజలకు మాత్రం వెన్నుపోటు పొడిచాడు బాబు సీఎం అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87 వేల కోట్లు ఉండేవి అంతవరకు లక్ష లోపు రుణం వడ్డీ లేకుండా, 3 లక్షల లోపు రుణం పావలా వడ్డీకే వచ్చేది అవి కట్టొద్దని ఆయన చెప్పిన పాపానికి.. ఈవాళ అపరాధ వడ్డీ కింద రైతులు 14-18 శాతం వడ్డీ కడుతున్నారు ఈ రెండేళ్లలో 87 వేల కోట్ల రైతు రుణాల మీద వడ్డీ రూపేణా 25వేల కోట్లు చెల్లించారు చంద్రబాబు రుణమాఫీ చేసింది వడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదు అదే రుణమాఫీ అని, రైతులకు పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తున్నారు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అంతకుముందు వడ్డీలేని రుణం వచ్చేది వాళ్లు రుణాలు కట్టని కారణంగా బ్యాంకులకు పోతే 2- 2.50 చొప్పున వడ్డీలు వసూలు చేస్తున్నారు చదువుకున్న పిల్లల పరిస్థితి మరీ దారుణం జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనేవారు ఉన్న ఉద్యోగాలు రేపు పొద్దున్న ఉంటాయో లేవో తెలియని దుస్థితిలో కాంట్రాక్టు ఉద్యోగులున్నారు రోజుకో ఉద్యోగం ఊడుతోంది. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే వెళ్లిపోయారు గోపాలమిత్రలు ధర్నాలు చేస్తున్నారు 2 వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే.. నేనెప్పుడు చెప్పానంటున్నారు 13 రీళ్ల వరకు విలన్‌దే పై చేయి కానీ... ఇంత దారుణంగా మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి సినిమాల్లో కనిపిస్తే ఆ వ్యక్తిని విలన్ అంటాం ఆ రోజుల్లో అయితే రాజనాల లాంటి వాళ్లు, చంద్రబాబు వయసుకు తగ్గవాళ్లు కనిపిస్తే ఈయనే గుర్తుకొస్తారు సినిమా 14 రీళ్లుంటే 13 రీళ్లు విలన్‌దే పైచేయిగా కనిపిస్తుంది ఆయన ఎన్ని మోసాలు చేసినా, అబద్ధాలు ఆడినా, ఎంత అన్యాయం చేసినా ఆయనదే పైచేయిగా కనిపిస్తుంది కానీ 14వ రీలు వచ్చేసరికి కథ క్లైమాక్స్‌కు వస్తుంది అక్కడ హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు హీరో విలన్‌ను వీరబాదుడు బాదుతాడు 14వ రీలు అయ్యేసరికి విలన్‌కు తగిన శిక్ష పడుతుంది ఇది ఏ సినిమాలో చూసినా కనిపిస్తుంది, జీవితం అనే సినిమాలో కూడా చివరకు ఇదే జరుగుతుంది చంద్రబాబు మాదిరిగా సీఎం కావడానికి, సీఎం రేసులో ఉన్నవ్యక్తి ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, సీఎం కుర్చీలో కూర్చోడానికి ఏ గడ్డయినా తింటానంటే.. ప్రజలు చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ వ్యవస్థ బాగుపడుతుందా అని అడుగుతున్నా చెప్పులు, చీపుర్లు చూపించండి రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటుంది నాయకులు మోసాలు చెబితే, అబద్ధాలు చెబితే చెప్పులు, చీపుర్లు చూపిస్తామని గట్టిగా నిలదీస్తే ఈ వ్యవస్థ మారుతుంది ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే.. రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది అబద్ధాలు ఆడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించండి.. ఫలానా వాడు మా నాయకుడని కార్యకర్తుల కాలర్ ఎగరేసుకునేలా మార్పు రావాలి మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అది సాధ్యం రేపు ఇదే చంద్రబాబు ఈసారికి రైతుల రుణాల మాఫీ మాత్రమే చెప్పాడు, బ్యాంకుల్లో బంగారం మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు రేపు ఎన్నికలకు చంద్రబాబు ఏమంటాడో తెలుసా.. ప్రతి ఇంటికీ కారు కొనిస్తానంటాడు, ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానంటాడు వ్యవస్థలో మార్పు రావాలంటే, రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలి అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది ఇన్ని రోజులూ రాజకీయాలు చూశాం. ప్రతి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఉంటాయి మన రాష్ట్రంలోనూ అది కొత్తేమీ కాదు. కాంగ్రెస్, టీడీపీ ఉండేవి ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల డబ్బు, మంత్రి పదవి ఎర, కాంట్రాక్టుల మోజు చూపించి పశువుల్లా కొనే పరిస్థితి ఎక్కడైనా ఉందా ఇది నిజంగా ఆశ్చర్చమే పట్టపగలు ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా.. 20 మందికి ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున దాదాపు 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారు ఇంత డబ్బు నీ అత్తగారి సొత్తా అని అడిగేవారు లేరంటే వ్యవస్థను చూసి బాధ అనిపిస్తుంది. పట్టపగలు, అడ్డగోలుగా తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తూ అక్కడ సూట్ కేసుల్లో డబ్బులిస్తూ. .. డబ్బుతో సహా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అనడానికి సిగ్గుపడాలి ఒక ముఖ్యమంత్రి ఇంత నల్లధనంతో పట్టుబడినా జైలుకు పోని పరిస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఉందంటే ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలి ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదు ప్రజలతో పనిలేదు, ప్రజలకిచ్చిన మాటలతో పనిలేదు, అవినీతి విచ్చలవిడిగా చేస్తా, ఆ డబ్బుతో అవసరమైతే ఓటుకు 3, 4 వేలిచ్చి ప్రజలను కొనుగోలుచేస్తానని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెబుతున్నారు చంద్రబాబుకు ఓ సలహా ఇస్తున్నా.. చంద్రబాబు కు ఓ సలహా.. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు 2004 నాటికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విచ్చలవిడిగా అవినీతి చేశావు. కానీ అప్పుడు వైఎస్ఆర్ వచ్చారు.. పాదయాత్ర చేశారు. నాడు 2004లో ఎన్నికలు అయ్యేనాటికి టీడీపీకి వచ్చినవి కేవలం 41 స్థానాలు మాత్రమే. చాలాచోట్ల ఆ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేస్తే.. ఆ అవినీతి సొమ్ము ఖర్చుచేస్తే నువ్వు గెలవవు అని సలహా ఇస్తున్నా చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు ఎంతటి దారుణంగా ఉన్నాయో మనమంతా చూస్తున్నాం ముద్రగడ చేసిన తప్పేంటి.. కొద్దిరోజుల క్రితం చూశాం.. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే, ఆ దీక్షను భగ్నం చేయడం, ఆయన భార్యను, కొడుకును కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోవడం అందరం చూశాం ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరాహార దీక్ష చేస్తే.. ఆ వ్యక్తిని ఇలా శిక్షించడం సరైనదేనా తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దొంగకేసులు పెట్టాల్సిందే నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు పోలీస్ టెర్రరిజాన్ని చూస్తున్నాం పోలీసువారూ, ఈవాళ అధికారం చంద్రబాబుది కావచ్చు కానీ అది ఎల్లకాలం ఉండదు జీతాలు ఇచ్చేది చంద్రబాబు అత్తగారి సొత్తు కాదు మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను గౌరవించండి అధికారం ఎల్లకాలం ఒకరిది కాదు మనం ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నాం.. వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నా గడప గడపకూ వైఎస్ఆర్ గడపగడపకూ వైఎస్ఆర్ అన్న గొప్ప కార్యక్రమానికి శ్రీకారం పలుకుతున్నా రాజకీయాలలో చాలాచోట్ల ఎమ్మెల్యేలు కావాలని, పైకి రావాలని చాలామంది అనుకుంటారు ఉత్సాహవంతులుంటారు... ఆ ఉత్సాహాన్ని నేను సపోర్ట్ చేస్తా రాజకీయాలలో గెలవడానికి ఒక సీక్రెట్ చెబుతా వాళ్ల వెనక పెద్దపెద్ద ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం లేదు, వారసత్వం అసలే అక్కర్లేదు గెలవాలంటే గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టాలి ఈ కరపత్రం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశావహులకు, సమన్వయకర్తలకు ఇస్తాం చంద్రబాబు చేసిన అన్యాయాలు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఏం చెప్పాడో ఇందులో కోట్ చేశాం రాజకీయ వ్యవస్థ మార్పులకు నాంది పలకాలన్న నా మాటలున్నాయి వంద ప్రశ్నలు ఇచ్చి, చంద్రబాబుకు మార్కులు వేయాలని కోరుతున్నాం మీరు ప్రజల వద్దకు వెళ్లి.. ప్రతి ఇంటికీ వెళ్లి మన ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ప్రతి ఇంటికీ వెళ్లండి ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లూ తిరగండి ఈ పాంప్లెట్ పంచి, ప్రజలచేత చంద్రబాబుకు మార్కులు వేయించండి వాళ్లు మార్కులు వేయడం మొదలుపెడితే వందకు ఆయనకు వచ్చే మార్కులు సున్నా అని తెలిస్తే ప్రజలే ఆయనను బంగాళాఖాతంలో కలుపుతారు సమయం ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు నిమిషాలు గడపండి వాళ్ల ఆశీస్సులు తీసుకోండి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి ప్రతి కోఆర్డినేటర్ ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు గ్రామంలో ప్రతి ఇల్లూ తిరిగితే గ్రామం మీద అవగాహన వస్తుంది ఎవరు మన పార్టీతో పాటు నడుస్తున్నారు, ఎవరు ఉత్సాహంగా మనతో ఉన్నారన్నది అర్థం అవుతుంది అప్పుడు ఆ గ్రామం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి బూత్ కమిటీ నియమించండి మీతోపాటు ఉత్సాహంగా నడిచిన వ్యక్తులను ఆ కమిటీలలో నియమించండి రోజుకు చేయవలసింది కేవలం ఒక పంచాయతీ.. నాలుగు గంటలు కష్టపడండి సాయంత్రం పూట ప్రజలంతా ఇళ్లలో ఉన్నారనుకున్నప్పుడు వెళ్లండి ఐదు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు మీరు తిరిగినట్లు అవుతుంది మీ వెనక ఎవరూ ఉండాల్సిన పనిలేదు.. ఈ ఐదు నెలల తర్వాత మీరే లీడర్ అవ్వకపోతే నన్నడగండి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడూ ఓడలేదు ఇప్పటికే ఆయన రెండుసార్లు తిరిగేశారు.. ఇలా ప్రజలతో మమేకం అయిపోతే ఏ ఎమ్మెల్యే ఎప్పటికీ ఓడిపోరు ఈ కార్యక్రమం నిజంగా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు చేశారు తమకు మేలు చేస్తారని నమ్మకం ఉన్న నాయకులకే ప్రజలు ఓట్లు వేస్తారు ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఏర్పడతాయి పాంప్లెట్లో కో-ఆర్డినేటర్ ఫొటో పెట్టుకునేదానికి కూడా స్థలం ఉంది నియోజకవర్గ సమస్యలపై మీరు ఏమైనా పాంప్లెట్ వేస్తే అది కూడా వేసి తీసుకెళ్లండి జూలై 8న వైఎస్ఆర్ జయంతి.. ఆరోజునే గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి తిరిగామంటే తిరిగాం అన్నది కాదు.. ప్రతి ఇంటికీ క్వాలిటీ టైమ్ ఇవ్వాలి గ్రామంలో అందరినీ ఒక చోటుకు రప్పించి మాట్లాడి వెళ్లిపోతే జరిగేది నష్టమే ఇళ్లకు వెళ్తే వాళ్ల ఆశీస్సులు మనకు లభిస్తాయి ఆ ఊళ్లో, ఆ సందులో ఏ సమస్య ఉందన్న విషయం కూడా పూర్తిగా అవగాహన అవుతుంది రెండేళ్లలో చంద్రబాబు చేసిన దోపిడీ ఎంత దారుణంగా ఉందో పుస్తకాలు వేశాం ఈ పుస్తకంలో ప్రతి అంశం కార్యకర్తలందరికీ తెలియాలి ఇంతకుముందు నాయకులు పలు అంశాలమీద మాట్లాడారు, తీర్మానాలు చేశారు బాధ కలిగించే అంశాలు రెండు మూడున్నాయి రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదాను మంటగలిపారు తన మంత్రులు కేంద్రంలో ఉన్నా.. వాళ్లను ఉపసంహరించే పరిస్థితి లేదు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వారిని ఉపసంహరించుకుంటా అనే దమ్ము, ధైర్యం లేవు ఎందుకంటే కారణం.. ఈ పుస్తకం. ఇందులోని అంశాలన్నింటిపై సీబీఐ విచారణ వేసి, మోదీ గారు జైల్లో పెడతారేమోనని భయం కృష్ణా, గోదావరి నదుల మీద కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా అడిగే పరిస్థితి లేదు దానికి కారణం కూడా మళ్లీ ఈ పుస్తకమే మన పోరాటంలో చంద్రబాబు చేతకానితనం, మోసాలు అన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లాలి ప్రజలకు అండగా ఉండాలని సవినయంగా అందరినీ కోరుకుంటున్నా దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ముద్రగడ దీక్షకు సంఘీభావంగానే... కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం నా పోలవరం పర్యటన ఆ కార్యక్రమాన్ని డీవియేట్ చేయకూడదని వాయిదా వేస్తున్నాం జూలై మొదటివారంలో అక్కడకు తప్పనిసరిగా వస్తానని చెబుతున్నా ఇప్పుడు రాలేకపోతున్నందుకు హృదయపూర్వకంగా క్షమించాలని కోరుతున్నాం -
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
గన్నవరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకుంటారు. కాగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బందర్ రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలతో సహా పలు ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారపక్షం వైఫల్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రతిపక్షాలపైనా, మీడియాపైనా కొనసాగుతున్న అణచివేత వైఖరి వంటి అంశాలతో పాటుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే పార్టీ కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లాల్సిన తీరుపై చర్చ జరుగుతుంది.