ప్రజల గోడు పట్టని ప్రభుత్వమిది | gadapa gadapaki ysrcp programme in kadapa | Sakshi
Sakshi News home page

ప్రజల గోడు పట్టని ప్రభుత్వమిది

Published Sat, Jul 16 2016 4:02 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

ప్రజల  గోడు పట్టని ప్రభుత్వమిది

ప్రజల గోడు పట్టని ప్రభుత్వమిది

గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో నేతల
ఎదుట ప్రజల ఆవేదన

 కడప అగ్రికల్చర్ : ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వానికి అసలు పట్టడం లేదని గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో నేతల ఎదుట ప్రజలు వాపోతున్నారు. శుక్రవార గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల నియోజవర్గంలోని సింహాద్రిపురంలో అహోబిలం, రావులకోలను గ్రామాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుఢు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకరరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ అరవిందనాధరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి పార్టీ ముద్రించిన కరపత్రాలను ఇచ్చి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. గ్రామానికి చెందిన భాస్కరెడ్డి రైతు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఇన్‌పుట్ సబ్సిడీ రాదని, బీమా ఇప్పించలేరని దుయ్యబట్టారు.  మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండలంలోని ముడిమాల, కేశాపురం, సిద్దయ్యమఠం గ్రామా ల్లో ఇంటింటికి ఎమ్మెల్యే చెట్టిపల్లె రఘురామిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి, ఎంపీపీ చక్రవర్తి, ముఖ్యనేతలు వెళ్లారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించారని, ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

అలాగే రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలోని చాపలవారిపల్లె, చుక్కాయపల్లె గ్రామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి, పార్టీ జిల్లా పరిశీలకుడు నరసింహారెడ్డి, సౌమిత్రి, మాజీ సర్పంచ్ భీమయ్య గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాలనను అడిగి తెలుసుకునే సమయంలో గ్రామానికి చెందిన మహిళ కూలీ గంగోజీ మాట్లాడుతూ ఫించన్లు తొలగిం చడంతో కుటుంబ పోషణ కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలంలోని గిరినగర్ కాలనీ, సుందరయ్య కాలనీల్లో ఇంటింటికి పార్టీ నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ విజయప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ సిద్దమ్మ, పార్టీ మండల కన్వీనర్ సి భాషలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తుండగా కాలనీకి చెందిన గంగయ్య తమకు ఇళ్లు లేదని ఇళ్లు మంజూరు చేయాలని వినిపత్రాలు ఇవ్వడానికి కాళ్లరిగేలా తిరిగి అలసిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, మున్సిపాలిటీలోని నేతలు పాల్గొని ఇంటింటి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement