
ప్రభుత్వంపై పోరుకు పార్టీ అండ
వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: ప్రభుత్వంపై చేసే పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులకు చెందిన పలు సమస్యలను ఆయనతో ఏకరువు పెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావించేలా కృషి చేస్తానని, అలాగే ప్రభుత్వంపై విద్యుత్ కార్మికులు చేసే పోరాటాలకు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రజలతో మమేకం :
శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నల్లచెరువుపల్లె జనార్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రసూల్ తదితరులు పాల్గొన్నారు.