
ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ కార్గవర్య సమావేశం ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లే విషయంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.