అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.10 కే భోజనవసతి కార్యక్రమాన్ని చైర్మన్ తలారి ఆదినారాయణ ప్రారంభించారు. బుధవారం యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పనుల నిమిత్తం మార్కెట్‌కు వచ్చిన రైతులకు రూ.25 విలువ చేసే భోజనం ఇస్కాన్ సహకారంతో రూ.10కే అందజేస్తామని చైర్మన్ తెలిపారు. తొలిరోజు 150 మంది వరకు రైతులు, చిరు వ్యాపారులకు ఉచితంగా భోజనం అందజేశారు. గురువారం నుంచి మార్కెట్‌కు వచ్చే రైతులు తొలుత టోకెన్ తీసుకోవాలన్నారు. శని, ఆదివారాల్లో కూడా భోజన వసతి కల్పించడంమై ఆలోచిస్తున్నామని తెలిపారు.
కరువు జిల్లాను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌యార్డుకు వచ్చే రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని గత ఏడాదిగా అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత సబ్సిడీతో భోజనం అందజేయాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పామురాయి వెంకటేశులు, సెలక్షన్‌గ్రేడ్–1 సెక్రటరీ ఏ.నూరుద్ధీన్, గ్రేడ్–2 సెక్రటరీ జి.ఆదినారాయణ, కమిటీ సభ్యులు, యార్డు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మార్కెట్‌యార్డులో రూ.10కే భోజనం ప్రారంభం
Published Wed, Mar 22 2017 11:53 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement