పరిస్థితి విషమం...
ఎంబీబీఎస్ చాలా కష్టంగా ఉందని సూసైడ్ నోట్
కడప అర్బన్: కడప రిమ్స్‌లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది చదువుతున్న జయసాయికృష్ణ (18) సోమవారం ఉదయం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు నగరం సి. క్యాంపు సమీప శ్రీరామ్‌నగర్‌లో నివసిస్తున్న ఎ. చంద్రశేఖర్ రెండో కుమారుడు జయసాయికృష్ణ ఈ ఏడాది రిమ్స్‌లో ఎంబీబీఎస్‌లో చేరాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన సాయికృష్ణ ఆదివారం రాత్రి కళాశాలకు చేరుకున్నాడు. ఎంబీబీఎస్ కష్టంగా ఉందని, చదవలేక పోతున్నందున ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన చావుకు ఎవరూ కారణం కాదని సోమవారం సూసైడ్ నోట్ రాశాడు. సోదరుడు శివభారత్‌కు ఫోన్ చేసీ చెప్పాడు.
అతని సమాచారం మేరకు ఇతర విద్యార్థులు గదికి చేరుకుని తలుపులు తెరిచారు. ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్న సాయికృష్ణను వెంటనే కిందికి దించి రిమ్స్ ఎంఐసీయూకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
రిమ్స్‌లో మెడికో ఆత్మహత్యాయత్నం
Published Tue, Oct 27 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM
Advertisement
Advertisement