Kadapa rims
-
కడపలో అత్యాధునిక కంటి వైద్యం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పగిరి కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తద్వారా రాయలసీమ వాసులకు అత్యాధునిక కంటి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 11.05 గంటలకు రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు జిల్లా కలెక్టర్‌తోపాటు పుష్పగిరి కంటి ఆస్పత్రి చైర్మన్ గోవిందారి, ప్రతినిధులు డాక్టర్ విశాల్ గోవిందారి, మెడికల్ చైర్మన్ డాక్టర్ విశ్వనాథ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 11.45 గంటలకు రిమ్స్ ఆవరణలో 2.05 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన సీఎం.. ఆస్పత్రిలోని రిసెప్షన్, కన్సల్టేషన్, ఆపరేషన్ థియేటర్లు, 150 పడకల బ్లాక్, తదితర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల గురించి కంటి ఆస్పత్రి చైర్మన్ సీఎంకు వివరించారు. ఆస్పత్రి చాలా బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆస్పత్రి ప్రతినిధులకు సూచించారు. 150 పడకలు.. ఏడు ఆపరేషన్ థియేటర్లు వైఎస్ జగన్ ప్రభుత్వం.. ప్రైవేటు రంగంలో సైతం వైద్యాన్ని ప్రోత్సహిస్తూ నిరుపేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. సీఎం ప్రారంభించిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్లో 150 పడకలతో పాటు ఏడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ల సౌకర్యం ఉంది. నలుగురు నిపుణులైన కంటి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. స్థానికంగా నిపుణులైన కంటి వైద్యులు కూడా ఈ ఆస్పత్రిలో సేవలు అందించనున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రజల కంటికి సంబంధించిన ప్రాథమిక సమస్యలు మొదలు తీవ్ర స్థాయి సమస్యలకు సైతం ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. -
అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది
సాక్షి, కడప : బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి లీలావతి (21) అనే యువతి బైకును ఆపింది. రిమ్స్‌లో తమ బంధువులు ఉన్నారని, అర్జెంటుగా వెళ్లాలని చెప్పి లిఫ్ట్ అడిగింది. దీంతో అతను ఆమెను బైకుపై ఎక్కించుకుని రిమ్స్‌కు బయలుదేరాడు. రిమ్స్‌లోని దంతవైద్య కళాశాల వద్దకు వెళ్లగానే అతనికి ఫోన్ రావడంతో బైకును అక్కడే ఆపి ఫోన్ మాట్లాడేందుకు పక్కకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన యువతి ఆ బైకును స్టార్ట్ చేసుకుని వేగంగా ఉడాయించింది. ఈ విషయంపై బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా, ఈనెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. నిందితురాలి పూర్తి వివరాలను తెలుసుకుని ఆమె కడపకు రాగానే పసిగట్టి శనివారం సాయంత్రం సింగపూర్ టౌన్షిప్ సర్కిల్ వద్ద అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
టై తో ఉరేసుకున్న విద్యార్థి..
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా కడపలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని మాంట్ ఫోర్ట్ ప్రయివేట్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9వ తరగతి చదువుతున్న చరణ్ రెడ్డి అనే విద్యార్థి టైతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యపై స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. చరణ్ రెడ్డి తల్లిదండ్రులతో పాటు, పోలీసులకు సమాచారం అందించలేదు. హడావిడిగా మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం అందుబాటులోకి లేకపోవడంపై చరణ్ రెడ్డి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడపలో విషాదం, టై తో విద్యార్థి ఉరి -
రైలు కింద పడి వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల సమీపంలోని జువారి ఎర్రగుడిపాడు రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆయనకు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని వారు పేర్కొన్నారు. తెల్ల చొక్కా, లుంగి ధరించి ఉన్నారని చెప్పారు. అతని ఆచూకీ తెలియాల్సి ఉందని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృత దేహాన్ని కడప రిమ్స్‌కు తరలించామని పేర్కొన్నారు. -
అంతా ‘బయట సేవే’!
పేరుకు రిమ్స్‌లో.. పనిచేసేది ప్రైవేట్‌లో.. ♦ విధులకు ఆలస్యంగా..వెళ్లేది ఆగమేఘాలపై.. ♦ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కూడా అక్కడికే.. ♦ కొందరు రోగులను సొంత క్లినిక్‌లకు మళ్లిస్తున్న వైనం ♦ అధునాతన ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు సహకారం ♦ కొందరు వైద్యుల తీరుతో ఇబ్బందులు పడుతున్న రోగులు ఎక్కడచూసినా...ఎక్కడికి వెళ్లినా కొందరు వైద్యులకు డబ్బుపైనే ధ్యాస. ప్రైవేటుపై ఉన్న మోజు రిమ్స్‌లోని రోగులపై లేకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. సొంత క్లినిక్‌లతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. మెరుగైన సేవలతో రిమ్స్‌కు మంచి పేరు తెద్దామన్న ఆలోచన వారు చేయకపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఈ క్రమంలో సీనియర్ డాక్టర్లే బయట వ్యవహారాలు చక్కబెడుతున్నప్పుడు....తామూ ఒక అడుగు వేస్తామన్నట్లు కొంతమంది ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేయగా, మరికొంతమంది కార్పొరేట్ సేవే లక్ష్యంగా పనిచేస్తూ పేద రోగుల సేవను గాలికొదిలేస్తున్నారు. సాక్షి, కడప/అర్బన్: సామాన్యుడి పాలిట పెద్దాస్పత్రిగా మారాల్సిన రిమ్స్....కొందరు డాక్టర్ల వ్యవహారశైలితో వైద్యసేవలకు దూరమై చిన్నాస్పత్రిగా మారుతోంది. వైద్యుడు అంటే....పేదవాడి పరిభాషలో దేవుడు అని అర్థం. కొందరు వైద్యులు ఏకంగా రోగి నాడి కూడా పట్టకుండా పంపిస్తున్నారనే ఆరోపణలున్నారుు. వారికి సంపాదనే పరమావధిగా మారిందని వైద్యసిబ్బందే చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లకు మేమేం తీసిపోమన్నట్లు రిమ్స్‌లోని కొందరు వైద్యులు వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుుతే ఇదే క్రమంలో రిమ్స్ సమయపాలనలో కూడా తేడాలు వస్తున్నారుు. అన్ని విభాగాల్లోనూ ఇంతే.. చాలామంది డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం....ప్రైవేటువైపే మొగ్గుచూపడం తదితర కారణాలతో రిమ్స్ ప్రతిష్ట రోజురోజుకు దెబ్బతింటోంది. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో పనిచేసే డాక్టర్లతోపాటు వైద్యసిబ్బంది కూడా తమస్థారుులో తాము బయటదారులు చూసుకుంటున్నారు. రిమ్స్‌లో వచ్చే జీతంతో ఏమవుతుంది? ఎంతో కొంత బయట కూడా వెనకేసుకోవాలనుకున్నట్లు పలు నర్సింగ్‌హోంలు, ఆస్పత్రులు, క్లినిక్‌లను వెతుకుతున్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫోన్ వచ్చిందంటే మధ్యలోనే మాయం కడప రిమ్స్‌లో క్యాజు వాలిటీ మొదలుకొని ఓపీ, ఐపీ విభాగాల్లో కొందరు వైద్యులు విధులను ఇష్టారాజ్యం గా నిర్వహించడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి అనేక వ్యయ ప్రయాసలతో వచ్చే పేదలు సరైన సమయానికి వైద్యం అందించకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. సెలవురోజుల్లో, ఆదివారాల్లోగానీ రిమ్స్ ఐపీ విభాగంలో చికిత్సలు పొందుతున్న వారి బాధ వర్ణణాతీతమనే చెప్పవచ్చు. మిగతా రోజుల్లో కూడా కొంతమంది డాక్టర్లు కడపలో ఆస్పత్రులకు కేంద్రాలైన క్రిస్టియన్‌లేన్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్లు, మద్రాసురోడ్డు, రవీంద్రనగర్, నాగరాజుపేట, ఎర్రముక్కపల్లె సర్కిల్, ఆర్టీసీ బస్టాండు-అప్సర రహదారి మధ్యలో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. రిమ్స్‌లో రోగులను పరీక్షిస్తున్న సమయంలో సదరు కన్సల్టెంట్ ఆస్పత్రుల నుంచి ఫోన్‌కాల్ వస్తే చాలు.. అత్యవసర పని ఉంద ని వెంటనే బయలుదేరిపోతారు. దీంతో ఆయన కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దుిస్థితి ఏర్పడింది. పేరుకే బయోమెట్రిక్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ పరీక్షలు చూసుకుని మధ్యాహ్నం 2గంటల వరకు వార్డు డ్యూటీ అనంతరం భోజనం చేసిన తర్వాత 2 నుంచి 4 గంటల వరకు ఉద్యోగులకు ఓపీ నిర్వహించాల్సి ఉంది. అరుుతే ఉదయం తూ.చ. తప్పకుండా బయోమెట్రిక్ మిషన్ వద్ద పంచ్ వేయగానే కొందరు వైద్యులు ఓపీకి హాజరై వెంటనే నగరంలోకి పరుగులు తీయడం, ఆపరేషన్లు, ఇతర వైద్యచికిత్సల్లో పాల్గొంటున్నారు. తర్వాత తప్పనిసరి అనిపిస్తే మాత్రమే రిమ్స్‌కు వెళుతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు టంచనుగా పంచ్ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆపరేషన్ల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ఆపరేషన్లకు రిమ్స పనిచేసే కొందరు స్పెషలిస్టు వైద్యులు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. తద్వారా ఆస్పత్రుల నుంచి పెద్దమొత్తంలో చెల్లించేలా ఒప్పందం నడుస్తోది. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించి కూడా ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేయడం ద్వారా ఎంతో కొంత డాక్టర్‌కు ముట్టజెప్పేలా లోపారుుకారి ఒప్పందాలు ఉన్నట్లు బయట ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా బయట సేవపైనే కొంతమంది డాక్టర్లు బాగా ఆసక్తి చూపుతున్నారు. కమిటీఏర్పాటు చేస్తాం రిమ్స్‌లో పనిచేస్తూ బయట ప్రైవేటుగా నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు నడిపే వారికి గతంలోనే హెచ్చరిక చేశాం. త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరెవరు ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతున్నారు? అవి ఏ పరిమితి వరకు నడపవచ్చు? అనే విషయాలపై పరిశీలిస్తున్నాం. ఏది ఏమైనా రిమ్స్‌లో చికిత్సపొందుతున్న రోగులను అలక్ష్యం చేసి బయటి ఆస్పత్రుల వైపు మొగ్గుచూపితే ఊరుకోం. అలాంటి వారిపైన దృష్టిపెడతాం! - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్, కడప -
విష ద్రావణం తాగి మహిళ మృతి
గాలివీడు మండల పరిధిలోని తూముకుంట ఎగువమూలకు చెందిన ఇర్రి మల్లికార్జున భార్య శివకళ్యాణి(22) కడుపునొప్పి తట్టుకోలేక విషద్రావణం తాగి మృతి చెందింది. మంగళవారం విషద్రావణం తాగిన ఆమెను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. తహసీల్దార్ భవాని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాలివీడు పోలీసులు తెలిపారు. -
‘అభాగ్యులకోసం’ ప్రత్యేకవార్డు
రిమ్స్ ( కడప అర్బన్ ) రిమ్స్‌లో అభాగ్యుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకట శివ సోమవారం ఆయా విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించారు. – ఐపీ విభాగంలోని మొదటి అంతస్తులో ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లెకు చెందిన నారాయణ (55) అనే వ్యక్తి అస్వస్థతలో పడి వుండటం గమనించారు. వెంటనే అతన్ని విచారిస్తే తాను ప్రొద్దుటూరు నివాసినని, మా బంధువులు వస్తారనీ తెలిపారు. అతన్ని ప్రత్యేక వార్డులో చేర్పించమని ఆర్ఎంఓ ఆదేశించారు. – క్షయ నివారణ వార్డు బయట కడప మాసాపేటకు చెందిన శివ అనే రోగి ఆరుబయట నిద్రిస్తుండగా అతన్ని ఆర్ఎంఓ విచారించారు. అతను వెంటనే లేచి తాను నెల రోజుల నుంచి క్షయ నివారణ విభాగంలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. సరిగా మందులు వాడుతున్నాని మొదట వచ్చినప్పటికీ, ఇప్పటికీ బాగుందని తెలిపారు. – ఐపీ విభాగంలో ఐడి వార్డును ‘అభాగ్యుల కోసం’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును ఆర్ఎంఓ పరిశీలించారు. మొదట పడక మంచంపై వున్న వ్యక్తిని పలుకరించారు. తన పేరు విజయకుమార్ అని, తనకు పాత బస్టాండ్ సమీపంలో 20 రోజుల క్రితం ప్రమాదం జరిగిందని తెలిపారు. తనను ఆటోలో రిమ్స్‌కు తీసుకుని వచ్చి చేర్పించారని తెలిపారు. ఆ విషయం తన సోదరి లలితమ్మకు కూడా ఇంతవరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచూకీ లేనివారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. -
రిమ్స్‌లో మెడికో ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం... ఎంబీబీఎస్ చాలా కష్టంగా ఉందని సూసైడ్ నోట్ కడప అర్బన్: కడప రిమ్స్‌లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది చదువుతున్న జయసాయికృష్ణ (18) సోమవారం ఉదయం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు నగరం సి. క్యాంపు సమీప శ్రీరామ్‌నగర్‌లో నివసిస్తున్న ఎ. చంద్రశేఖర్ రెండో కుమారుడు జయసాయికృష్ణ ఈ ఏడాది రిమ్స్‌లో ఎంబీబీఎస్‌లో చేరాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన సాయికృష్ణ ఆదివారం రాత్రి కళాశాలకు చేరుకున్నాడు. ఎంబీబీఎస్ కష్టంగా ఉందని, చదవలేక పోతున్నందున ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన చావుకు ఎవరూ కారణం కాదని సోమవారం సూసైడ్ నోట్ రాశాడు. సోదరుడు శివభారత్కు ఫోన్ చేసీ చెప్పాడు. అతని సమాచారం మేరకు ఇతర విద్యార్థులు గదికి చేరుకుని తలుపులు తెరిచారు. ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్న సాయికృష్ణను వెంటనే కిందికి దించి రిమ్స్ ఎంఐసీయూకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.