భర్తను కిడ్నాప్‌ చేశారని భార్య ఫిర్యాదు | men kidnaping case | Sakshi
Sakshi News home page

భర్తను కిడ్నాప్‌ చేశారని భార్య ఫిర్యాదు

Published Thu, Sep 29 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

men kidnaping case

అంతర్వేదిపాలెం (సఖినేటిపల్లి) : 
గుర్తుతెలియని వ్యక్తులు భర్తను కిడ్నాప్‌ చేసారంటూ గురువారం భార్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం, గ్రామంలో మహ్మద్‌ ఆలీషా మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మెకానిక్‌ షెడ్‌ వద్దకు వెళ్తున్నానని భార్య మహ్మద్‌ అయేషాతో చెప్పి వెళ్లిన ఆలీషా ఇంటికి తిరిగిరాలేదు. రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ 37 సీవీ 0999 నంబరు తెల్ల కారులో వచ్చి వారి మొబైల్‌ నుంచి ఆయేషాను ఆమె భర్తతో మాట్లాడించి రూ.ఐదు లక్షలు ఇస్తే వదలిపెడతామని డిమాండ్‌ చేసి వెళ్లిపోయారు. ఆయేషా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement