కర్నూలు (న్యూసిటీ): విజ్ఞానం ద్వారానే మానవ వికాసం కలుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు యాగంటీశ్వరప్ప పేర్కొన్నారు. ఆదివారం కృష్ణానగర్‌లోని జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్సులో వచ్చిన మార్పులను వివరించాలన్నారు. సైన్సును సక్రమంగా వినియోగించుకొనకపోతే వినాశనం జరుగుతుందన్నారు. బాల్యం నుంచే సైన్సుపై అభిరుచి పెంచుకునేలా శాస్త్రీయ విద్య ఉండటం సమాజం గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌మియ్యా, రాష్ట్ర కోశాధికారి సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, కార్యదర్శులు శ్రీరాములు, వీరేష్, కోశాధికారి దామోదరం, జిల్లా నాయకులు ఎలమర్తి రమణయ్య, జిల్లా మండల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.