భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు నల్లగొండలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం ఆలేరులో జరిగే మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తూ ఆయన యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు వెయ్యి బైక్ ల ర్యాలీతో కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. అంతకుమునుపు ఆయన పాటిమడ్ల గ్రామంలో రూ.3 కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్
Published Fri, Jun 24 2016 1:38 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement