భద్రాచలం బస్టాండ్లో తుపాకి మిస్ ఫైర్ | missfire in bhadrachalam bustand | Sakshi
Sakshi News home page

భద్రాచలం బస్టాండ్లో తుపాకి మిస్ ఫైర్

Published Wed, Aug 26 2015 10:37 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

missfire in bhadrachalam bustand

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయింది. 141వ బెటాలియన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ బుధవారం ఉదయం బస్టాండ్ ఆవరణలోని ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో తుపాకీని భుజానికి తగిలించుకోవడంతో ట్రిగ్గర్ వీపుకి తగిలి ఫైర్ అయింది. నాలుగు బుల్లెట్లు బయటకు వచ్చి నేలకు తగలడంతో ప్రమాదం తప్పింది. అయితే, కాల్పుల శబ్దాలకు అక్కడున్న వారు భయకంపితులయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement