missfire
-
హైదరాబాద్ మింట్ కాంపాండ్ లో గన్ మిస్ ఫైర్
-
HYD: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రామయ్య గురువారం మింట్ కాంపౌండ్‌లో విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో తన తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో, బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది కూడా చదవండి: కర్రతో కొట్టి చోరీయత్నం.. ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం -
క్షిపణి మిస్ ఫైర్ పై రాజ్యసభలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన
-
భద్రాచలం బస్టాండ్‌లో తుపాకి మిస్ ఫైర్
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయింది. 141వ బెటాలియన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ బుధవారం ఉదయం బస్టాండ్ ఆవరణలోని ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో తుపాకీని భుజానికి తగిలించుకోవడంతో ట్రిగ్గర్ వీపుకి తగిలి ఫైర్ అయింది. నాలుగు బుల్లెట్లు బయటకు వచ్చి నేలకు తగలడంతో ప్రమాదం తప్పింది. అయితే, కాల్పుల శబ్దాలకు అక్కడున్న వారు భయకంపితులయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. -
పేలిన ఎయిర్‌గన్.. బాలుడి చెంపలోకి బుల్లెట్
నర్సింహులపేట(వరంగల్ జిల్లా): పిల్లలు ఎయిర్ గన్‌తో సరదాగా ఆడుకుంటుండగా అది మిస్ ఫైర్ అయింది. దీంతో ఓ బాలుడి చెంపలోకి బుల్లెట్ దూసుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో శుక్రవారం జరిగింది. గ్రామంలో సర్పంచ్ వెలుగు ఉపేందర్ కుమారుడు ప్రేమ్‌సాయి, విద్యుత్ శాఖలో పని చేస్తున్న పులిగుజ్జ సైదులు కుమారుడు మనోజ్‌లు స్నేహితులు. వీరు శుక్రవారం సర్పంచ్ వెలుగు ఉపేందర్ ఇంట్లో ఆడుకుంటున్నారు. సరదాగా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న ఎయిర్‌గన్ తీసుకొని ప్రేమ్‌సాయి ఆడుతుండగా, మిస్‌ఫైర్ అయి ఎదురుగా ఉన్న మనోజ్ చెంపలోకి బుల్లెట్ దూసుకుపోయింది. మనోజ్‌ను చికిత్స నిమిత్తం తొర్రూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మిస్‌ఫైర్
సీఐకి తప్పిన ప్రమాదం ఉలిక్కిపడిన పోలీసులు నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ జరిగింది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఓ డీఎస్పీ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ జరిగింది. ఆ సమయంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ భాస్కర్ సమీప చెట్టు దగ్గర ఫోన్ మాట్లాడుతుండగా బుల్లెట్ ఆయన కడుపు మీద నుంచి స్వల్పంగా రాసుకుంటూ వెళ్లింది. వెంటనే స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మిస్‌ఫైర్‌తో పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాదులు ఏమైనా పోలీసు కార్యాలయంలోకి వచ్చి.. కాల్పులు జరిపారా అన్న అనుమానంతో పోలీసులంతా అప్రమత్తమయ్యారు.