నల్లగొండ జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ జరిగింది.
సీఐకి తప్పిన ప్రమాదం ఉలిక్కిపడిన పోలీసులు
నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ జరిగింది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఓ డీఎస్పీ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ జరిగింది. ఆ సమయంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ భాస్కర్ సమీప చెట్టు దగ్గర ఫోన్ మాట్లాడుతుండగా బుల్లెట్ ఆయన కడుపు మీద నుంచి స్వల్పంగా రాసుకుంటూ వెళ్లింది.
వెంటనే స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మిస్‌ఫైర్‌తో పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాదులు ఏమైనా పోలీసు కార్యాలయంలోకి వచ్చి.. కాల్పులు జరిపారా అన్న అనుమానంతో పోలీసులంతా అప్రమత్తమయ్యారు.