రివాల్వర్, బుల్లెట్లు,వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాధాకిషన్‌రావు
రాంగోపాల్‌పేట్: కారులో ఉంచిన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను దొంగిలించిన బాలుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ రాధాకిషన్‌రావు వివరాలు వెల్లడించారు. మొఘల్‌పుర సుల్తాన్‌షాహికి చెందిన 4 టీవీ రిపోర్టర్ మహ్మద్ నమాన్ ఒమర్ 2016లో లైసెన్సుడ్ రివాల్వర్ తీసుకున్నాడు. గత డిసెంబర్ 24న అతను తన స్నేహితుడితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి తిరిగి వస్తూ భోజనం చేసేందుకు మాసబ్‌ట్యాంక్‌లోని ఓ హోటల్ వద్ద కారు ఆపాడు. అందులో లైసెన్సు డు రివాల్వర్‌ను ఉంచాడు. మెహిదీపట్నం సంతో ష్‌నగర్‌కు చెందిన బాలుడు (16) కారులో విలువైన వస్తువుల కోసం గాలించగా అందులో రివాల్వర్ కనిపించ డంతో ఎత్తుకెళ్లాడు.
భోజనం ముగించుకుని వచ్చిన ఒమర్ కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారులో రివాల్వర్ కనిపించకపోవడంతో చోరీకి గురయినట్లు గుర్తించాడు. మరుసటి రోజు ఉదయం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారు నిలిపిన స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తుతెలియని బాలుడు దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీ ప్రాంతంలోని అతడికి ఇంటికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనున్న రివాల్వర్‌తో పాటు 6 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బాలుడిని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో సైఫాబాద్ డీఐ నరహరి, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు తిమ్మప్ప, వినోద్, కాంతారెడ్డి పాల్గొన్నారు.
లైసెన్స్‌దారుడిపై కేసు
రివాల్వర్ తీసుకున్న ఒమర్‌పై కూడా కేసు నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. రివాల్వర్ తీసుకున్న వ్యక్తులు బయటికి వెళితే దానిని తమ కస్టడీలోనే ఉంచుకోవాలని అలా కాకుండా నిర్లక్ష్యంగా కారులో ఉంచి దానికి కనీసం తాళం కూడా వేయకుండా వెళ్లాడన్నారు. ఆర్మ్స్‌యాక్ట్ ప్రకారం అతనిపై చర్యలు తీసుకుని లైసెన్సును రద్దు చేయనున్నట్లు తెలిపారు. గన్ లైసెన్సు పొందిన వ్యక్తులు పోలీసులు సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment