
వికలాంగునిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
మహబూబ్ నగర్(వంగూరు) : పెన్షన్ రాలేదంటూ ఎమ్మెల్యే ఎదుట నిరసన తెలిపినందుకు ఓ వికలాంగునిపై ఆగ్రహించి ఆయన చేయి చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా వంగూరులో ఆదివారం మధ్యాహ్నాం చోటుచేసుకుంది. తమకు పెన్షన్లు రావడం లేదంటూ వికలాంగులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎదుట నిరసన చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఓ వికలాంగునిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతు అయింది. వికలాంగులు తమ నిరసనను మరింత ఉద్రిక్తం చేశారు.