mla guvvala balaraju
-
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: గువ్వల బాలరాజు
-
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. ఇది కేసీఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ సమాజం అమ్ముడుపోదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నిస్సిగ్గుగా తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా కుట్రను బయటపెట్టారని అన్నారు. ఇదీ చూడండి: మునుగోడు లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్ -
ఎఫ్ఆర్వోపై దాడికి నిరసనగా ర్యాలీ
అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అటవీ రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) పై ఎమ్మెల్యే అనుచరుల దాడికి నిరసనగా అచ్చంపేటలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. అటవీ శాఖకు చెందిన అతిథి గృహం కేటాయింపు విషయంలో ఎఫ్ఆర్వో రామేశ్వర్‌రెడ్డి పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు శుక్రవారం దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనకు నిరసనగా అటవీ సిబ్బంది పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. దాడులకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవీందర్, మాజీ ఎమ్మెల్యే రాములు, ఎఫ్ఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి విజయానందరావు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అటవీ అధికారిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
అచ్చంపేట రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అటవీశాఖ అధికారిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు శుక్రవారం దాడి చేశారు. అతిథి గృహం కావాలంటే పై అధికారులను అడగాలన్న వాచ్‌మన్ అంజిని ఎమ్మెల్యే అనుచరులు దుర్భాషలాడారు. తర్వాత ఎమ్మెల్యే బాలరాజు తన అనుచరులతో కలసి ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ వై.రామేశ్వర్‌రెడ్డి చాంబర్లోకి వెళ్లి అతిథిగృహం కేటాయించాలని అడిగారు. ఉన్నతాధికారులు వస్తున్నందున ఇవ్వలేనని, క్యాంపు ఆఫీసు అందుబాటులో ఉందని సమాధానమిచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు ఆయనపై దాడి చేశారు. తన గొంతు కింద గాయపర్చి, పిడిగుద్దులు కురిపించారని బాధితుడు వాపోయారు. -
వికలాంగునిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
మహబూబ్ నగర్(వంగూరు) : పెన్షన్ రాలేదంటూ ఎమ్మెల్యే ఎదుట నిరసన తెలిపినందుకు ఓ వికలాంగునిపై ఆగ్రహించి ఆయన చేయి చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా వంగూరులో ఆదివారం మధ్యాహ్నాం చోటుచేసుకుంది. తమకు పెన్షన్లు రావడం లేదంటూ వికలాంగులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎదుట నిరసన చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఓ వికలాంగునిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతు అయింది. వికలాంగులు తమ నిరసనను మరింత ఉద్రిక్తం చేశారు.