టీడీపీ ఆరిపోయే దీపం
అక్రమ కేసులకు భయపడేది లేదు
2019లో జగనే సీఎం
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరి: టీడీపీ ఆరిపోయే దీపమని, అక్రమ కేసులకు భయపడేది లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. పట్టణ పరిధిలోని సీవీఆ ర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్కే రోజా అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణకరరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆది మూలం, రాష్ట్ర సంయుక్త కమిటీ సభ్యుడు పోకల ఆశోక్‌కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడిని నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదన్నారు. ఈ అక్కసుతోనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ పేరుతో పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కే సులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఎమ్మెల్సీకే దక్కుతుందని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేజే కుమార్ కుటుంబం, నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాసనసభ్యురాలైన తనపై నగరి జాతరలో దాడి జరిగి రెండేళ్లు గడిచినా ఇంత వరకు ఏం చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఈటీపీ ప్లాం ట్ ప్రారంభానికి అడ్డుపడుతూ, అధికారులను బెదిరి స్తూ, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
2019లో జగనే సీఎం
చంద్రబాబు మోసపూరిత హామీలు ప్రజలకు తెలిసిపోయాయని, 2019లో ఎన్నికలలో జగనన్న సీఎం కావడం ఖాయమని రోజా పేర్కొన్నారు. అంత వరకు నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో పని చేయాలని పిలుపునిచ్చారు. గడప గడపకూ వైఎస్సార్ ద్వారా టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రాక్షస పాలన
కేజే కుమార్‌పై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, దీనికి భయపడేది లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పీజీ నీలమేఘం అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ తుడుచిపెట్టుకొని పోతుందని, రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న పాలన రావాలని మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి అన్నారు. ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడు నామినేట్ పదవి తీసుకుని ప్రజల్లో తిరుగుతూ చిచ్చుపెటుతున్నారని రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్ అన్నారు. అంతకుముందు అతిథులను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభావేదికపై జ్యోతి వెలిగించి, వైఎస్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళ్లు అర్పించారు. సమావేశంలో విజయపురం, పుత్తూరు, నిండ్ర, వడమాలపేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.