టీబీ మొబైల్ టీముల ప్రారంభం
సిద్దిపేట జోన్ : జిల్లా వ్యాప్తంగా క్షయ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ అదేశాల మేరకు టీబీ మొబైల్ టీములను సోమవారం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన 5 ద్విచక్ర వాహనాలతో కూడిన సిబ్బంది బృందాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ బృందాలు ఆయా గ్రామాల్లోని క్షయ వ్యాధిగ్రస్తులను కలిసి సలహాలు, సూచనలతో పాటు వారికి ఆరోగ్యపరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రామకృష్ణ, ఉపవైద్యాధికారి శివానందం, జాతీయ ఆరోగ్యమిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జగన్నాథరావు పాల్గొన్నారు.