ఆధునిక పద్ధతులలో కంది సాగుచేసుకోవాలి
Published Sat, Aug 13 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
ఖానాపురం : రైతులు కంది పంటను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని ఏడీఆర్ రఘురామిరెడ్డి అన్నారు. స్థానిక కృషి ఉన్నతి అవార్డు గ్రహీత వేముల వెంకటేశ్వర్‌రావు సాగు చేసిన కంది పంటను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కకు మొక్కకు మధ్య నాలుగు ఫీట్ల దూరం, సాలుకు సాలుకు మధ్య 7 ఫీట్ల దూరంలో పంట సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త ఉమారెడ్డి, ఏఓ వసుధ, ఏఈఓ శ్యామ్ రైతులు బొప్పిడి పూర్ణచందర్‌రావు, పరుచూరి రత్నకర్‌రావు పాల్గొన్నారు.
Advertisement