Modern methods
-
ఆధునిక పద్ధతులు అనుసరణీయం
– ప్రకృతి వ్యవసాయంపై ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి నంద్యాలరూరల్: ప్రకృతి వ్యవసాయం ఆధునిక పద్ధతులు అనుసరణీయమని వేదశాస్త్ర విజ్ఞాన పరిశోధనా సంస్థల ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం ప్రాచీన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యుగంలో అనుసరణీయత అన్న అంశంపై రైతు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. కాలానుగుణంగా సాగు విధానాలు కూడా మార్చుకోవాలన్నారు. ఉద్యాన పంటలు, మూలికల సేద్యం చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి దేశీవాలి ఆవు కీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పశుపోషణ చేపట్టాలన్నారు. జీవామృతం తయారు చేసుకొనే విధానాన్ని రైతులకు వివరించారు. ఆర్‌ఏఆర్‌ఎస్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ నాగరాజరావు, సరళమ్మ, మునిరత్నం, జయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా చేపట్టాలని రైతులకు సూచించారు. శిక్షణా శిబిరంలో నంది రైతు సమాఖ్య నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, అప్పిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులతో సాగు చేయాలి
-ఏజేసీ తిరుపతిరావు శిక్షణ పొందిన యువ రైతులకు సర్టిఫికెట్ల పంపిణీ పోచమ్మమైదాన్ : ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని ఏజేసీ తిరుపతిరావు అన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్‌లో శిక్షణ పొందిన యువ రైతులకు శుక్రవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతిరావు హాజరై మాట్లాడారు. రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాలని, మార్కెట్ రేటుకు అనుగుణంగా పంటలు వేయాలని సూచించారు. అనంతరం కంది, సోయాబీన్, జవార్, వరి క్షేత్రాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉష, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ డాక్టర్ రఘురామిరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, ఉమారెడ్డి పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులలో కంది సాగుచేసుకోవాలి
ఖానాపురం : రైతులు కంది పంటను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని ఏడీఆర్ రఘురామిరెడ్డి అన్నారు. స్థానిక కృషి ఉన్నతి అవార్డు గ్రహీత వేముల వెంకటేశ్వర్రావు సాగు చేసిన కంది పంటను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కకు మొక్కకు మధ్య నాలుగు ఫీట్ల దూరం, సాలుకు సాలుకు మధ్య 7 ఫీట్ల దూరంలో పంట సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త ఉమారెడ్డి, ఏఓ వసుధ, ఏఈఓ శ్యామ్ రైతులు బొప్పిడి పూర్ణచందర్రావు, పరుచూరి రత్నకర్‌రావు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులతోనే అధికదిగుబడులు
గజ్వేల్: సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధ్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ సౌత్ జోన్ జనరల్ మేనేజర్ మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో సత్యసాయి సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. గ్రీన్హౌస్, కల్టివేషన్ విధానంలో సాగు చేపడితే మంచి ఫలితాలుంటాయన్నారు. వ్యవసాయశాఖ గజ్వేల్ నియోజకవర్గ ఓఎస్డీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ, రైతులు గ్రామస్థాయి నుంచి సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విత్తన తయారీ, శుద్ధి అంశాలను వివరించారు. పశుసంవర్దక శాఖ ఏడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
దేవరకద్ర : వ్యవసాయంలో రైతులు ఆధునిక పద్ధతులను పాటించి అధిక దిగుబడిని పొందాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు భగవత్ స్వరూప్ సూచించారు. శుక్రవారం మండలంలోని బస్వాపూర్‌లో ఆత్మ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలని, కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను వాడితే నేల సారంవంతం అవుతుందన్నారు. వర్షాకాలం ప్రారంభంలో జీలుగను సాగు చేసుకోవాలని, విత్తనాలను శుద్ధి చేసుకుంటే చీడ పీడల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. చౌడు నేలలు సారవంతం కావడానికి చౌడును తగ్గించడానికి జిప్సము వాడాలని, వరి పంటల్లో కాలిబాటలు తీయాలని దీని వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చని సూచించారు. పోటాష్ వాడకం వల్ల మొక్కల వేర్లు పెరుగుదల బాగుంటుందని, పొట్టదశలో వాడితే మొక్కలు బలంగా ఉంటాయని, దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్‌కుమార్, విస్తీర్ణాధికారులు సుజాత, మంజుల, ఎన్జీఓస్ బాల్‌రాజు, శ్రీనివాస్, బాలగౌడ్ పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులనే వాడండి అమ్రాబాద్ : సేంద్రియ ఎరువులతో భూసారాన్ని కాపాడుకోవచ్చని, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను విరివిగా వాడాలని వ్యవసాయశాఖ ఏడీఏ సరళకుమారి అన్నారు. ఆదర్శ మహిళాసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అమ్రాబాద్‌లో సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల వినియోగం, లాభాలు, రసాయన ఎరువులతో కలిగే నష్టాల గురించి వివరించారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, వేప కశాయం తయారీ గురించి వివరించారు. నేల స్వభావాన్ని బట్టి పంటలను వేసుకోవాలని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆదర్శమహిళాసంఘం అధ్యక్షురాలు అంతమ్మ, చైతన్య రైతు మిత్ర సోసైటీ చెర్మైన్ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. ఆరుతడి సాగే మేలు పెబ్బేరు : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి కుర్మయ్య కోరారు. శుక్రవారం యాపర్ల గ్రామంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఖరీప్ సాగుకు అనుకూలంగా వర్షాలు కురవక పోవడంతో రైతులు కందులు, మొక్కజొన్న, జొన్న తదితర ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. అనంతరం ఉల్లి, మొక్కజొన్న పంటలను పరిశీలించి సూచనలిచ్చారు. ఆయన వెంట సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ సభ్యులు గౌరమ్మ, తదితరులు ఉన్నారు.