సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధ్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా..
గజ్వేల్: సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధ్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ సౌత్ జోన్ జనరల్ మేనేజర్ మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో సత్యసాయి సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. గ్రీన్‌హౌస్, కల్టివేషన్ విధానంలో సాగు చేపడితే మంచి ఫలితాలుంటాయన్నారు.
వ్యవసాయశాఖ గజ్వేల్ నియోజకవర్గ ఓఎస్‌డీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ, రైతులు గ్రామస్థాయి నుంచి సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విత్తన తయారీ, శుద్ధి అంశాలను వివరించారు. పశుసంవర్దక శాఖ ఏడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.