భద్రాదిలో ప్రధాని సోదరుడు | modi brother visits badrachalam | Sakshi
Sakshi News home page

భద్రాదిలో ప్రధాని సోదరుడు

Published Wed, Jul 6 2016 9:12 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

భద్రాదిలో ప్రధాని సోదరుడు - Sakshi

భద్రాదిలో ప్రధాని సోదరుడు

భద్రాచలం(ఖమ్మం): భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు సోమాభాయి ఆనంద్ మోదీ బుధవారం దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్న ఆయన ఎటువంటి హంగూఆర్భాటం లేకుండా తోటి మిత్రులతో కలసి అంతరాలయంలో ఉన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మోదీ సోదరుడు అని తెలియటంతో ఆలయ మర్యాదలు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించగా, ఆయన వాటిని తిరస్కరించారు. సామాన్య భక్తుడి మాదిరే దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ప్రొటోకాల్, బందోబస్తు లేకుండానే ఆయన భద్రాచలం పర్యటనకు రావటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement