వెల్లువలా వినతులు
- వినతులు వెంటనే పరిష్కరించాలి
- మీకోసంలో అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం
- ప్రజల నుంచి వినతులు స్వీకరణ
అనంతపురం అర్బన్ : ప్రజల నుంచి వారి సమస్యలపై స్వీకరించే మీ కోసం, జన్మభూమి, తదితర అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి అర్జీలు స్వీకరించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయినగర్‌లో పరిధిలో పలు విద్యుత్ స్తంబాలు పాడయ్యాయని, కొన్ని ఇనుప స్తంభాలు తుప్పుపట్టాయని జాయింట్ కలెక్టర్‌కు ప్రసన్నాయపల్లి సర్పంచ్ భూమిరెడ్డి సావిత్రి చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న వీటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేసేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశాలించాలని కోరారు. అదేవిధంగా మీ కోసంలో వివిధ సమస్యలపై మొత్తం 452 అర్జీలు వచ్చాయి.
బధిరులు కోటా భర్తీ చేయాలి
అన్ని ప్రభుత్వ శాఖల్లో వికలాంగుల రిజర్వేషన్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన బధిరులతో భర్తీ చేయాలని బధిరులు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యర్శులు ఎం.మోహన్‌బాబు, బి.రాఘవేంద్ర కోరారు.
పోర్జీ సంతకాలతో నిధులు స్వాహా
కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరులోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మహిళ సంఘం లీడర్లు, సభ్యులకు తెలియకుండా యానిమేటర్ పోర్జీర సంతతకాలో నిధులు స్వాహా చేశారని సంఘం అధ్యక్షురాలు లక్ష్మిదేవి, సభ్యులు సుశీలమ్మ, అంజనమ్మ, తదితరులు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అంబేడ్కర్ నేమ్ బోర్డులను పునర్‌నిర్మించాలి
రాంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ నేమ్ బోర్డులు రైల్వే బ్రిడ్జి నిర్మాణ క్రమంలో ద్వంసం అయ్యాయని, వాటిని పునర్మించాలని అంబేద్కర్ మిలినీయం కమిటీ కన్వీనర్ నాగలింగమయ్య, వైఎసార్‌సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబుళేసు, దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు.
శ్మశాన స్థలం కబ్జా
రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వేపచర్ల గ్రామంలోని శ్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించారని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. శ్మశానానికి ప్రహరీ నిర్మించి స్థలాన్ని పరిరక్షించాలని కోరారు.