ఈ యంత్రంతో ఇంధనం, డబ్బు ఆదా! | More fuel, money will be saved with pedaling car | Sakshi
Sakshi News home page

ఈ యంత్రంతో ఇంధనం, డబ్బు ఆదా!

Published Thu, Apr 28 2016 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

ఈ యంత్రంతో ఇంధనం, డబ్బు ఆదా!

ఈ యంత్రంతో ఇంధనం, డబ్బు ఆదా!

గుత్తి (అనంతపురం): అనంతపురం జిల్లాలో ఎస్కేడీ ఇంజనీరింగ్ విద్యార్థులు సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించారు.ఈ యంత్రానికి పెడలింగ్ ఆపరేటెడ్ కార్ అని నామకరణం చేశారు. దీనికి ఇంధనం అవసరం లేదు. శబ్ద, వాయు కాలుష్యం ఉండదు. ఎస్కేడీలో గురువారం ఈ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ యంత్రాన్ని మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న దత్త, గణేష్, భరత్, నిరంజన్, యువరాజ్, రాజశేఖర్‌లతో పాటు లెక్చరర్ అశోక్‌లు నెల రోజులు శ్రమించి ఈ యంత్రాన్ని(వాహనం) తయారు చేశారు. ఈ సరికొత్త వాహనంలో కొంత మంది వ్యక్తులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సులభంగా ప్రయాణం చేయవచ్చు.

సైకిల్‌లో ఉపయోగించే పెడలింగ్ ద్వారా మనిషి శారీరక శ్రమ ద్వారా ఈ యంత్రం పని చేస్తుంది. ఈ వాహనాన్ని ఉపయోగిస్తే మనం తర్వాతి తరం వారికి కూడా ఇంధనాన్ని ఇవ్వవచ్చు. ఈ సందర్భంగా వాహనాన్ని రూపొందించిన విద్యార్థులను కాలేజ్ అధినేతలు ఏవీ ప్రతాప్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రామయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, హెచ్‌ఓడిలు శ్రీనివాసులు, శ్రీధర్, మోహన్‌నాయుడు, అశోక్‌కుమార్ రాజు, రాజకుమార్, వెంకటేష్ తదితరులు అభినందించారు.

Advertisement
Advertisement