వినూత్న రీతిలో మానవ, సహజ వనరుల వినియోగం
వినూత్న రీతిలో మానవ, సహజ వనరుల వినియోగం
Published Wed, Feb 15 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
కాకినాడ సిటీ :
సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో వినూత్న రీతిలో మానవ వనరులను, సహజ వనరులను వినియోగించామని కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. స్మార్ట్ గ్రామాల రూపకల్పనపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. మోరిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఇతర జిల్లాల కలెక్టర్లకు కలెక్టర్ వివరించారు. గ్రామంలో అన్ని కుటుంబాలకు ఫైబర్‌నెట్ కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యత కల్పించామన్నారు.పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం అన్ని గృహాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, వ్యర్థ పదార్థాల సద్వినియోగం, ఆక్వాకల్చర్, వ్యవసాయం, జీడిపప్పు, చేనేత మగ్గాల వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ఉత్పత్తులు పెంచామన్నారు. టక్కర్ మాట్లాడుతూ మోరి తరహాలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 456 గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపొందించనున్నట్టు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఇ¯ŒSచార్జి డీపీఓ కుమార్ పాల్గొన్నారు.
మార్చి 15కి పూర్తి చేయాలి
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మార్చి 15వ తేదీ నాటికి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈఓపీఆర్‌డీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, మీసేవా ద్వారా ఆ¯ŒSలై¯ŒS పౌరసేవల కల్పన, న్యూట్రీ గార్డె¯ŒSల అభివృద్ధిపై ఆదేశాలు జారీచేశారు. కాతేరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, స్వాహాలకు పాల్పడిన స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని తొలగించాలని డీపీఓను ఆదేశించారు. పంచాయతీలలో ఇప్పటి వరకూ 19 శాతం ఆస్తి పన్ను వసూళ్లు జరిగాయని, వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో అమలవుతున్న ఈ ఆఫీస్ వ్యవస్థను గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డీపీఓ టీవీఎస్ గంగాధరకుమార్, డివిజ¯ŒS పంచాయతీ అధికారులు శర్మ, నాగలక్ష్మి, వరప్రసాద్, ఈఓఆర్‌డీలు పాల్గొన్నారు.
Advertisement