sakinetipalli
-
గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
సాక్షి, సఖినేటిపల్లి: ఉయ్యూరువారిమెరక గ్రామానికి చెందిన చింతా మనోహర్ (23) ఆదివారం వేకువజామున హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెలవు కావడంతో స్నేహితులతో కలసి గుడికి వెళుతున్న క్రమంలో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మృతి చెందాడు. వీరందరూ మాదాపూర్ అయప్ప సొసైటీలోని మారుతి మెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. మనోహర్‌కు వివాహమైంది. అతడి భార్య సుస్మిత, కుమార్తెతో కలిసి నర్సాపురంలో ఉంటున్నారు. ఉద్యోగ రీత్యా మనోహర్ మాదాపూర్ హాస్టల్లో ఉంటున్నాడు. మనోహర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు తాడి సహదేవ్ చెప్పే వరకూ కుటుంబ సభ్యులకు తెలియదని స్థానికులు అంటున్నారు. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై) వీవీమెరకలో విలపిస్తున్న మనోహర్ తల్లిదండ్రులు ప్రేమ వివాహం వీవీ మెరకకు చెందిన సీహెచ్‌వీబీ నందం, ప్రియ దంపతులకు మనోహర్, మానస సంతానం. నందం బట్టేలంక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నర్సాపురంలో పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో మనోహర్‌కు సుస్మిత పరిచయమైంది. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. వివాహం తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ మనోహర్ ఏడాదిగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. రెండు నెలల క్రితం మాదాపూర్‌లో యానిమేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు. అయితే ప్రేమ వివాహం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. సెటిలయ్యాక వస్తానన్నాడు మనోహర్ మృతి చెందాడన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని నందం బోరున విలపించారు. శుక్రవారం మనోహర్‌తో మాట్లాడానని, శనివారం పాఠశాలలో కొన్ని పనులు ఉండడంతో మాట్లాడలేకపోయామన్నారు. ఆదివారం ఉదయం ప్రమాద వార్త విని తట్టుకోలేకపోయామన్నారు. జాబ్‌లో సెటిల్ అయ్యాక ఇంటికి వస్తానని మనోహర్ చెప్పేవాడని కన్నీటి పర్యతమయ్యారు. చెట్టంత కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లి ప్రియ రోదిస్తోంది. -
గోదావరి మధ్యలో నిలిచిన పంటు
-
అంతర్వేదిలో మళ్లీ గ్యాస్ లీక్
సఖినేటిపల్లి: ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికం భయాందోళనలకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ శివారులోని 20వ నెంబర్ బావి నుంచి శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అవుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేస్తున్నారు. గ్యాస్ లీక్ ను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. -
వినూత్న రీతిలో మానవ, సహజ వనరుల వినియోగం
కాకినాడ సిటీ : సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో వినూత్న రీతిలో మానవ వనరులను, సహజ వనరులను వినియోగించామని కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. స్మార్ట్ గ్రామాల రూపకల్పనపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. మోరిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఇతర జిల్లాల కలెక్టర్లకు కలెక్టర్ వివరించారు. గ్రామంలో అన్ని కుటుంబాలకు ఫైబర్‌నెట్ కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యత కల్పించామన్నారు.పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం అన్ని గృహాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, వ్యర్థ పదార్థాల సద్వినియోగం, ఆక్వాకల్చర్, వ్యవసాయం, జీడిపప్పు, చేనేత మగ్గాల వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ఉత్పత్తులు పెంచామన్నారు. టక్కర్ మాట్లాడుతూ మోరి తరహాలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 456 గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపొందించనున్నట్టు తెలిపారు. డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఇ¯ŒSచార్జి డీపీఓ కుమార్ పాల్గొన్నారు. మార్చి 15కి పూర్తి చేయాలి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మార్చి 15వ తేదీ నాటికి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, మీసేవా ద్వారా ఆ¯ŒSలై¯ŒS పౌరసేవల కల్పన, న్యూట్రీ గార్డె¯ŒSల అభివృద్ధిపై ఆదేశాలు జారీచేశారు. కాతేరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, స్వాహాలకు పాల్పడిన స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని తొలగించాలని డీపీఓను ఆదేశించారు. పంచాయతీలలో ఇప్పటి వరకూ 19 శాతం ఆస్తి పన్ను వసూళ్లు జరిగాయని, వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో అమలవుతున్న ఈ ఆఫీస్ వ్యవస్థను గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డీపీఓ టీవీఎస్ గంగాధరకుమార్, డివిజ¯ŒS పంచాయతీ అధికారులు శర్మ, నాగలక్ష్మి, వరప్రసాద్, ఈఓఆర్డీలు పాల్గొన్నారు.