అయ్యో ‘పాప’ం! | mother leav a girl as road side | Sakshi
Sakshi News home page

అయ్యో ‘పాప’ం!

Published Tue, May 3 2016 2:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

అయ్యో ‘పాప’ం! - Sakshi

అయ్యో ‘పాప’ం!

నడిరోడ్డుపై ఎనిమిదేళ్ల పాప
తన తల్లే వదిలి వెళ్లిందంటున్న బాలిక
బాలికను బాలల పరిరక్షణ కమిటీకి అప్పగించిన పోలీసులు

 జవహర్‌నగర్: భారమైందో.. వదిలించుకోవాలనుకున్నారో... ఎందుకోగాని.. ఓ ఎనిమిదేళ్ల బాలికను నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. ఆ పాప రోడ్డుపై ఏడుస్తుండగా స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెన్నాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నాపురం చర్చి సమీపంలో సంధ్య (08) ఒంటరిగా ఏడుస్తుండగా స్ధానికులు గమనించి జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సంధ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రుల వివరాలు అడిగారు. తల్లి లలిత, తండ్రి ప్రకాశ్ అని, తాము కూకట్‌పల్లిలో ఉంటున్నామని తెలిపింది. సంధ్య కూకట్‌పల్లిలోని ప్రతిభ పాఠశాలలో 3వ తరగతి చదువుతుంది. తన తల్లే తనను చెన్నాపురం చర్చ్ వద్ద వదిలిపెట్టి పోయిందని పాప చెప్పిందని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు పోలీసులు సోమవారం సాయంత్రం సంధ్యను బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement