ఎంపీ కనబడుట లేదు | MP Missing | Sakshi
Sakshi News home page

ఎంపీ కనబడుట లేదు

Published Sat, Aug 27 2016 9:50 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

ఎస్‌ఐకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు - Sakshi

ఎస్‌ఐకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

– పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
వనపర్తిరూరల్‌ : నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు నంది ఎల్లయ్య కనబడుట లేదని ఆరోపిస్తూ శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఎన్నికయినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్ల ప్రజలు వివిధ సమస్యలతో అల్లాడిపోతున్నారని అన్నారు. జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదలైనా ఇప్పటికీ ఎంపీగారు స్పందించకపోవడం దారుణమని చెప్పారు. అనంతరం ఎస్‌ఐ గాంధీ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, రాజశేఖర్, భాస్కర్, బుడ్డన్న, రాజు, యూసూప్, జుబేర్, మహేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement