ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం క్షీణించింది | mudragada padmanabam wife, daughters condition critical, says doctors | Sakshi
Sakshi News home page

ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం క్షీణించింది

Published Sun, Jun 12 2016 10:45 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం క్షీణించింది - Sakshi

ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం క్షీణించింది

రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భార్య, కోడలు ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ముద్రగడ అనుమతితో ఆయన భార్య, కోడలికి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు ఆదివారం ఉదయం వైద్యులు చెప్పారు.

వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ పద్మనాభం సహకరించడంలేదని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement