condition critical
-
వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్య
చేర్యాల (సిద్దిపేట): అధికార బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ సభ్యు డు శెట్టె మల్లేశం (43) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. చేర్యాల మండలంలోని స్వగ్రామమైన గుర్జకుంటలో మల్లేశం సోమవారం ఉదయం 6 గంటలకు రోజు మాదిరిగా మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరారు. గుర్జకుంట క్రాస్ రోడ్డు వైపునకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలై కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పగా, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మల్లేశం మృతి చెందారు. ఆయనకు ఏదైనా ప్రమాదంలో గాయాలయ్యాయా? లేదా ఎవరైనా దాడి చేశారా? అన్న అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి. తర్వాత పోలీసులు హత్యగా నిర్ధారించారు. మల్లేశంపై దాడికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని త్వరగా గ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని 24 గంటల్లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. మల్లేశానికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి ప్రజాసేవ కోసం పరితపించే శెట్టె మల్లేశం మృతి చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. మృతికి కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
ఆత్మహత్యాయత్నంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళ
సర్పవరం (కాకినాడ సిటీ) : టీడీపీ మహిళా నాయకురాలు తనను వేధిస్తోందంటూ కాకినాడ ధర్మపోరాట దీక్షలో హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సమక్షంలో పురుగుమందు తాగి కాకినాడ ప్రభుత్వాసుపత్రి మెడికల్ విభాగం ఏఎంసీయూ–2లో చికిత్స పొందుతున్న మల్లాడి లక్ష్మి పరిస్థితి మూడురోజులైనా విషమంగానే ఉంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు సంధ్యకుమారి, అమృతవల్లీలకు వివాహం కాగా, మౌనికకు వివాహం కాలేదు. ఇదిలా ఉంటే తమ తండ్రి చేపలు వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడని, తల్లి లక్ష్మి జీజీహెచ్‌లో సెక్యూరిటీగా పనిచేస్తుందని కుమార్తెలు తెలిపారు. వేట నిషేధం ఉండడంతో ప్రస్తుతం అమ్మ ఆదాయంపైనే ఆధారపడ్డామని, అమె ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండడంతో తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కుమార్తెలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైద్యులు ఏడు రోజుల వరకు ఆమె పరిస్థితిని చెప్పలేమంటున్నారని, ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారని వారు రోధిస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న బస్సు
రణస్థలం : మండల కేంద్రంలో సూర్య స్కూల్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన గొర్లె రామారావు(25) విశాఖపట్నం వైపు నుంచి ద్విచక్రవాహనంపై లావేరు వైపు వస్తున్నాడు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య స్కూల్ వద్దకు వచ్చేసరికి వేగ నియంత్రణ బోర్డులు తప్పిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఇతడిని ఢీకొట్టింది. బైక్ పడిపోవడంతో రామారావు తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానిక పోలీసులు వచ్చి బాధితుడిని అంబులెన్స్‌లో ఎక్కించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుడి చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం, వాంతులు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
వైద్యం చేయకుంటే ముద్రగడ పరిస్థితి ప్రమాదకరం
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడకు వెంటనే వైద్యం అందించాలని, లేకుంటే ఆయన పరిస్థితి విషమిస్తుందని వైద్యులు సూచించారు. ముద్రగడ అనుచరులు, సహచర నాయకులతో ప్రభుత్వం మంతనాలు సాగిస్తోంది. ఆకుల రామకృష్ణ సహా ముద్రగడ అనుచరులు ఏడుగురితో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన ముగ్గురు కాపు నాయకులను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముద్రగడ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఏంటి, ఎవరు చర్చల్లో పాల్గొంటారన్న విషయంపై స్పష్టత రాలేదు. -
క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మంగళవారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. జైల్లో ఉన్న కాపు జేఏసీ నేతలను ఆస్పత్రికి తరలించగా, కలెక్టర్ అక్కడే వారితో చర్చలు జరిపారు. ముద్రగడ వైద్యానికి సహకరించేలా కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని, తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది. -
ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం క్షీణించింది
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భార్య, కోడలు ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ముద్రగడ అనుమతితో ఆయన భార్య, కోడలికి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు ఆదివారం ఉదయం వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ పద్మనాభం సహకరించడంలేదని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
శివసేన నాయకుడిపై కాల్పులు
శివసేన నాయకుడు అనిల్ చౌహాన్‌పై కాల్పులు జరిగాయి. వెంటనే ఆయనను భక్తివేదాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయమే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర ముంబైలోని కశ్మీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్ చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు ఎవరు, ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామని ముంబై పోలీసు అధికారి అవినాష్ అంబురే తెలిపారు. -
బాలచందర్ పరిస్థితి ఇంకా విషమమే
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ విషయాన్ని ఆయనకు చికిత్సలు అందిస్తున్న చెన్నైలోని కావేరి ఆస్పత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు. బాలచందర్ మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించి డయాలసిస్ లాంటి చికిత్సలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం బాలచందర్ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు. -
కన్న కూతురు గొంతు కోసిన తండ్రి
తాను ఓ వ్యక్తిని ప్రేమించానంటూ కుమార్తె కన్న తండ్రికి వెల్లడించింది. అంతే కన్న తండ్రి ఆగ్రహాంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న కత్తి తీసి కుమార్తె గొంతు కోశాడు. దాంతో ఆ కుమార్తె రక్తపు మడుగులో కుప్పకూలింది. ఆ ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండల గుమ్మనూరులో గురువారం చోటు చేసుకుంది. అయితే కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.