వైద్యం చేయకుంటే ముద్రగడ పరిస్థితి ప్రమాదకరం | mudragada padmanabham condition critical, says doctors | Sakshi
Sakshi News home page

వైద్యం చేయకుంటే ముద్రగడ పరిస్థితి ప్రమాదకరం

Published Tue, Jun 14 2016 5:49 PM | Last Updated on Mon, Jul 30 2018 6:23 PM

mudragada padmanabham condition critical, says doctors

రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడకు వెంటనే వైద్యం అందించాలని, లేకుంటే ఆయన పరిస్థితి విషమిస్తుందని వైద్యులు సూచించారు.

ముద్రగడ అనుచరులు, సహచర నాయకులతో ప్రభుత్వం మంతనాలు సాగిస్తోంది. ఆకుల రామకృష్ణ సహా ముద్రగడ అనుచరులు ఏడుగురితో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన ముగ్గురు కాపు నాయకులను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముద్రగడ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఏంటి, ఎవరు చర్చల్లో పాల్గొంటారన్న విషయంపై స్పష్టత రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement