ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించింది.
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మంగళవారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. జైల్లో ఉన్న కాపు జేఏసీ నేతలను ఆస్పత్రికి తరలించగా, కలెక్టర్ అక్కడే వారితో చర్చలు జరిపారు. ముద్రగడ వైద్యానికి సహకరించేలా కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని, తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది.