వికారాబాద్: కనీస వేతనాల పెంపు కోరుతూ గడిచిన 14 రోజులుగా సమ్మెచేస్తోన్న వికారాబాద్ మున్సిపాలిటీ కార్మికులు ఆదివారం వినూత్నరీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓ శునకానికి మెమోరండం ఇచ్చారు.
కార్మికులకు కనీస వేతనం రూ. 14,170, సూపర్‌వైజర్స్‌కు రూ. 17380 వేతనం చెల్లించి పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వికారాబాద్ మున్సిపల్ ఆఫీసు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో మున్సిపాల్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అధ్యక్షుడు పి. మల్లేశం, ఇతర కార్మిక నేతలు మాపాల్గొన్నారు. కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీలు ఈ నెల 20 నుంచి 24 వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
కుక్కకు మెమోరండం
Published Sun, Jul 19 2015 8:47 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement