అధికారుల వేధింపుల వల్లే నా భర్త అదృశ్యమయ్యాడు.
-
భువనగిరి సబ్‌జైలు సూపరిండెంట్ శ్రీనివాస్ అదృశ్యంతో అయోమయానికి గురవుతున్న కేసముద్రంలో కుటుంబసభ్యులు.
-
అధికారుల వేధింపుల వల్లే..
-
భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ భార్య సరిత
-
శ్రీనివాస్ మామకు డీజీపీ ఫోన్
కేసముద్రం: తన భర్తను అకారణంగా యేడాదిలోపే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, అందుకే మానసికవేదనకు లోనై అదృశ్యమయ్యాడని భువనగిరి సబ్‌జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ భార్య సరిత చెప్పింది. బుధవారం ఆమె వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో తన పుట్టింటి వద్ద విలేకరులతో మాట్లాడారు. మూడురోజుల క్రితం బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చి రోజూ మదనపడుతున్నాడని, ఎంత సర్దిచెప్పినా, నేను ఏం తప్పుచేశాను, ఎంతో సిన్సియర్‌గా పనిచేస్తున్న నన్ను అకారణంగా ఎందుకు బదిలీ చేశారంటూ తనతో తరచూ చెప్పాడన్నారు. చివరకు నేను సర్దిచెప్పి, ఎక్కడైన ఉద్యోగమేగా చేయాల్సిందని చెబితే సరేననిఽ కొద్దిరోజులపాటు మీ పుట్టింటికి వెళ్లి ఉండమని చెప్పడంతో మా తండ్రికి ఫోన్‌చేసి తనను తీసుకెళ్లమని చెప్పానని వెళ్లడించింది. తన భర్త డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పి మంగళవారం రాత్రి వెళ్లిపోయాడని, బుధవారం ఉదయం తన తండ్రితో కలిసి కేసముద్రానికి బయలుదేరేందుకు సిద్దంకాగా, ఓ కానిస్టేబుల్ వచ్చి, మేడమ్ మీ ఇంట్లో ప్రీజ్‌పై సార్ కవర్‌పెట్టాడని, తనను తీసుకోమని చెప్పాడని, దీంతో తాను ఏమైఉంటుందోనని సందేహపడుతూ ఆ కవర్‌ను తీసుకువచ్చి కానిస్టేబుల్‌కి ఇచ్చానని, డిపార్ట్‌మెంట్‌కు సంబంఽధించిన కవర్ అయిఉంటుందని సదరు కానిస్టేబుల్ చెప్పడంతో తిరిగి కృష్ణాఎక్స్‌ప్రెస్‌లో కేసముద్రంకు బయలుదేరామని వివరించింది.
తన భర్త శ్రీనివాస్‌కు మంగళవారం రాత్రి ఒకసారి ఫోన్‌చేస్తే కలవలేదని, సిగ్నల్ లేదనుకున్నా, తీరా ఉదయం చేసినా కలవలేదని చెప్పింది. రైలు దిగి ఇంటికి రాగానే.. తన భర్తనోట్ రాసి వెళ్లిపోయినట్లు ఫోన్ వచ్చిందని, ఇంతలో శ్రీనివాస్ అదృశ్యమైనట్టు టీవీల్లో వార్తలు వచ్చాయన్నారు. సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయాడని వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందానన్నారు. సరిత తండ్రి గోవర్దన్ మాట్లాడుతూ టీవీల్లో వార్తలు చూసి శ్రీనివాస్‌కు ఫోన్ చేశానని, ఫోన్ కలవలేదన్నారు. ఇంతలో మీడియాలో వస్తున్న వార్తలను చూసిన జైళ్ల శాఖ డీఐజీ నర్సింహారావు స్పందించి తనకు ఫోన్‌చేశాడని, తిరిగి అదే స్థానంలో పనిచేసే విధంగా చూస్తామని చెప్పినట్లు గోవర్దన్ చెప్పారు. అనంతరం సరితతోపాటు, ఆమె కుటుంబ సభ్యులు భువనగిరికి హుటాహుటిన బయలుదేరారు.
గత సంవత్సరం జూన్ నుంచి భువనగిరిలో విధులు
శ్రీనివాస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట సబ్‌జైలు నుంచి రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు డిప్యూటీ జైలర్‌గా వచ్చాడు. ఆ తర్వాత 2015జూన్‌లో భువనగిరిలో సబ్‌జైలులో సూపరిండెంట్‌గా బదిలీ అయ్యాడు. అప్పటి నుండి భార్య, ఇద్దరు పిల్లలతో భవనగిరిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత మూడురోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని లక్ష్మాయిపేటలోని సబ్‌జైలుకు సూపరిండెంట్‌గా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. కేసముద్రం స్టేషన్‌కి చెందిన మారగాని గోవర్దన్ కూతురు సరితతో 2011లో శ్రీనివాస్‌కు వివాహమైంది. వీరికి అన్విత(3), జస్విక్(3నెలలబాబు) ఉన్నారు.