
'కేసీఆర్.. క్షమాపణ చెప్పు'
హైదరాబాద్: టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం సరికాదని, ఈ విషయంలో సీఎం కీసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తలసాని రాజీనామా చేయకపోతే ఆయనను గవర్నర్ బర్తరఫ్ చేయాలని, స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని కోరారు. తలసాని విషయంలో స్పీకర్ కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా రాజీనామాకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.