రాప్తాడు : పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్ చౌదరిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు రాప్తాడు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు. యల్లనూరు మండల కేంద్రానికి చెందిన బోయ ఓబులేసును ఈనెల 28న రాప్తాడు మండలంలోని పండమేరు వంకలో దాడి చేసిన విషయం తెలిసిందే. ఓబులేసుపై దాడి చేసి గాయపరినందుకు నగేష్ చౌదరిపై 324, 341, 326 సెక‌్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతపురం కోర్డులో హాజరు పరచినట్లు ఎస్‌ఐ తెలిపారు.